సీఎం జగన్ ని ప్రశంసించిన ప్రధాని మోడీ సోదరుడు.

వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండి చేస్తున్న పనులకి వివిధ వర్గాల నుండి ప్రశంశలు వస్తూనే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పొరుగు రాష్ట్రాల పాలకులు సైతం ఆకర్షితులవుతున్నారు. దిశా చట్టం పత్రాలను డిల్లీ , ఒడిస్సా ముఖ్యమంత్రులు కోరటం, రివర్స్ టెండరింగ్ పద్దతి గురించి ఇతర రాష్ట్రాలు ఆరా తీయటం లాంటి సంఘటనలతో ముఖ్యమంత్రి జగన్ దేశంలోని వివిధ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. అయితే తాజాగా ప్రధాన మంత్రి మోడీ సొదరుడు జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రజలు కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక వేత్త ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోడీ వాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన రాష్ట్ర స్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దనుర్మాస వేడుకుల్లో పాల్గొని పూజలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షల మందికి పైగా ఉన్నారని బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్ధికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారని, ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు

Show comments