iDreamPost
android-app
ios-app

Mla vamsi – క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం.. వివాదానికి సమాప్తం..

Mla vamsi – క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం.. వివాదానికి సమాప్తం..

ధూష‌ణ‌లు, స‌వాళ్ల‌తో వేడెక్కిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఇప్పుడు క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇది ఓ ర‌కంగా మంచి సంస్కృతే అయినా.. అక‌స్మాత్తుగా మారుతున్న వాతావ‌ర‌ణం కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఎప్పుడో అన్న మాట‌ల‌కు ఇప్పుడు వంశీ క్ష‌మాణ‌లు చెప్ప‌డం.. అందుకు గ‌ల కార‌ణాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని, ఆమె సైతం అదే అభిమానం చూపించేవారని చెప్పుకొచ్చారు. తన మనసుకు ఆమె పేరు తో అలా మాట్లాడటం సరి కాదని చెప్పి క్షమాపణ చెప్పానన్నారు. తమను ఒత్తిడి చేసే వారో, బెదిరించే వాళ్లో లేరని వంశీ తేల్చి చెప్పారు. తన ఇంట్లో మహిళలను టీడీపీ నేతలు చాలా దారుణంగా కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇష్యూ లో 5 శాతం తన తప్పు ఉంటే..చంద్రబాబు తో సహా టీడీపీ నేతల తప్పు 95 శాతం తప్పు ఉందన్నారు. తాను సంస్కారంతో క్షమాపణ చెప్పానని..పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో మా ఇంట్లో వారిని తిట్టించినందుకు వాళ్లు క్షమాపణ చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు. వాళ్లు లాగా తాను ఉండకూడదని సంస్కారంతో క్షమాపణ చెప్పానన్నారు. ఎవరో బెదిరింపులు.. పకోడి గాళ్ల హెచ్చరికలతో తాను క్షమాపణ చెప్పలేదని వంశీ స్పష్టం చేేశారు. తనకు భువనేశ్వరి అంటే గౌరవమని…అయితే, ఒక విషయం పైన స్పందించే క్రమంలో పొరపాటున నోరు జారానని వివరించారు.

ఆ ఇద్ద‌రిపై నా ధోర‌ణి మార‌దు..

చంద్రబాబు..లోకేష్ ను విధాన పరంగా విమర్శిస్తానని..అందులో తగ్గేది లేదని వంశీ తేల్చి చెప్పారు. తాము దేవినేని లాగా సూటుకేసులు మోయలేదన్నారు. లోకేష్ లాగా సూటుకేసులు తీసుకోలేదని చెప్పారు. చంద్రబాబు కులం ..మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కమ్మ హాస్టల్ లోనో..కమ్మ కాలేజీలోనో చదువుకోలేదని స్పష్టం చేేశారు. తాను కులం పేరుతో రాజకీయం చేసే ఉన్మాదిని కాదని వెల్లడించారు. అసలు కమ్మ వర్గం ఎక్కువగా ఉండేది ఖమ్మం జిల్లా అని..అటువంటిది అక్కడ టీడీపీకి ఏ మేర మద్దతు ఉందని వంశీ ప్రశ్నించారు. తాము ఇప్పుడు జగన్ తో ఉన్నామని..జగన్ కోసం నిలబడతామని…చివరి వరకూ జగన్ తోనే ఉంటామని..అందుకే ఇంతలా తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ మీద కుల ప్రభావం ఏదీ లేదని స్పష్టం చేేశారు.

మ‌ల్లాది వాసు కూడా..

ఇదిలా ఉంటే.. వల్లభనేని వంశీ, కొడాలి నానీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మల్లాది వాసు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతోన్న అన్యాయం చూసి బాధపడి వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తనకు ఏ రకమైన నేర సంస్కృతి లేదని.. హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసి బాధతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. కొంతమంది కావాలని తన వీడియోని వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తనకు ఎవరి మీద కక్షలు లేవని.. స్కెచ్ వేయటం.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయటం లాంటి ఉద్దేశాలు లేవన్నారు. కమ్మ కమ్యూనిటీ, వెల్ఫేర్, సంక్షేమం కోసం ఖర్చు పెడతానని వివరించారు. తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.

Also Read : TDP, Tiruvuru Constituency – టీడీపీకి కొరుకుడు పడని తిరువూరు