iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యే నిమ్మల సైకిల్‌ యాత్రకు బ్రేక్‌

ఎమ్మెల్యే నిమ్మల  సైకిల్‌ యాత్రకు బ్రేక్‌

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్‌ యాత్రకు బ్రేక్‌ పడింది. రైతులు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్‌ చేసినా వారు స్పందించకపోవడంతో తాను సైకిల్‌ యాత్ర ప్రారంభించానని చెప్పిన నిమ్మలను పోలీసులు భీమవరం వద్ద అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలులేదని పోలీసులు వారించారు. అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యే నిమ్మలకు మధ్య వాగ్వాదం జరిగింది.

వ్యవసాయ, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సంక్షభాన్ని నివారించేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పాలకుల కళ్లు తెరిపించేందుకే తాను సైకిల్‌ యాత్ర ప్రారంభించానని ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో ఉండడం లేదని నిమ్మల ఆరోపించారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయిన విషయం తెలిసిందే. అన్ని రంగాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. వీలైనంత వరకూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ఆక్వా ఉత్పత్తులు, ధాన్యం కొనుగోలు చేసేందుకు, చేయించేందుకు చర్యలు చేపట్టింది. రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తులకు ధరలను కూడా నిర్ణయించింది. రాజకీయ లక్ష్యంతోనే నిమ్మల సైకిల్‌ యాత్ర చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: నిమ్మల ఓవర్ యాక్షన్ .. ఈ టైంలో సైకిల్ రాజకీయాలా ?