Idream media
Idream media
సంపద సృష్టించా.. ఆదాయం పెంచా.. అంటూ తరచూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాలన గురించి గొప్పగా చెబుతుంటారు. ఆయన మాటల్లో వాస్తవం ఎంతో వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. బాబు చేసిన ఘనకార్యాలకు నేటికీ వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా.. నేటికీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన బకాయలు చెల్లించడానికే తమకు సరిపోతోందని మంత్రి కురసాల కన్నబాబు నిర్వేదం వ్యక్తం చేయడం బాబు నిర్వాకాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు, పెన్షనర్లకు పెట్టిన డీఏ బకాయలను చెల్లించేందుకు ఏపీ మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ మొత్తం బకాయలు 11 వేల కోట్ల రూపాయలుగా తేలిచ్చింది. వీరితోపాటు అంగన్‌వాడీలు, హోం గార్డుల జీతాలు బకాయలు కూడా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హాయంలో పెట్టిన బకాయలే కావడం గమనార్హం. ఈ బకాయల వివరాలు చూసిన వారు ఎవరైనా.. మంత్రి కన్నబాబు నిర్వేదాన్ని అర్థం చేసుకోగలరు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏపీ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలే. ఇక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు 60 వేల కోట్లు, డిస్కంలకు 20 వేల కోట్ల బకాయలు పెడింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిని వైసీపీ ప్రభుత్వం క్రమంగా తీర్చుకుంటూ వస్తోంది. తాజాగా ఉద్యోగుల, పెన్షనర్లకు డీఏ బకాయలు, అంగన్‌వాడీలు, హోం గార్డులకు జీతాల బకాయలు చెల్లించేందుకు సిద్ధమైంది.
ఓ పక్క బాబు పెట్టిన బకాయలను చెల్లింస్తూనే.. మరో వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. వినూత్న పథకాలతో నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోనూ నగదు జమ చేయడంతోపాటు, గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించిన సీఎం జగన్.. దేశం దృష్టిని ఆకర్షించారు. సంపద సృష్టించా.. ఆదాయం పెంచాననే బాబు.. వాస్తవంగా అప్పులు పెంచారు.. బకాయలు అట్టిపెట్టిపోయారనేది కేబినెట్ తాజా నిర్ణయంతో స్పష్టంగా అర్థమవుతోంది.
తాము ఇచ్చిన రుణామాఫీ హామీలోని నాలుగు, ఐదు వాయిదాలు చెల్లించాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు.. తమ ప్రభుత్వ హాయంలో పెడింగ్‌లో పెట్టిన కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్స్‌లు బకాయలు చెల్లించాలని మాత్రం డిమాండ్ చేయకపోవడం విశేషం.