iDreamPost
android-app
ios-app

KTR సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే TSPSCని ప్రక్షాళణ చేస్తాం!

  • Author singhj Published - 03:58 PM, Wed - 18 October 23
  • Author singhj Published - 03:58 PM, Wed - 18 October 23
KTR సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే TSPSCని ప్రక్షాళణ చేస్తాం!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. వరుస మీటింగ్స్​తో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. మరోసారి ఓటర్ల మనసులు గెలుచుకొని పవర్​లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కరీంనగర్​లో ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి కేటీఆర్​తో పాటు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు రమణ, భాను ప్రసాద్ రావు, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.

ప్రవళిక విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఈ రోజు తనను కలిశారని చెప్పారు. ఒకడు తమ అమ్మాయిని వేధించి చంపాడని ప్రవళిక పేరెంట్స్ చెప్పారని.. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చానన్నారు కేటీఆర్.  ప్రవళిక సోదరుడికి సర్కారు ఉద్యోగం ఇస్తామని చెప్పానన్నారు. ఆ కుటంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. అవసరమైతే టీఎస్​పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి న్యాయం చేస్తామని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారు వచ్చి మాయమాటలు చెబుతారు జాగ్రత్త అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘అద్భుతమైన మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యే కాబోతున్న గంగుల కమలాకర్​కు నా అభినందనలు. గంగులకే కాదు ఎంపీ ఎన్నికల్లో వినోద్​నూ భారీ మెజారిటీతో గెలిపించాలి. గత ఎలక్షన్స్​లో మోసం జరిగింది. ఎంపీగా నెగ్గిన బండి సంజయ్ కరీంనగర్ కోసం ఏం చేశాడు? బడి లేదు, గుడి లేదు.. ఆయనేమీ తేలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు దేవుడో బండి సంజయ్ చెప్పాలి. మోడీ చెప్పినట్లు రూ.15 లక్షలు వచ్చిన వారంతా బీజేపీకి ఓటు వేయండి. ఆ డబ్బులు రానివాళ్లు బీఆర్​ఎస్​కు ఓటు వేయండి’ అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరి.. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాపం రేవంత్‌.. కాంగ్రెస్‌ గెలిచినా సీఎం కాలేరా?