iDreamPost
android-app
ios-app

చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే రంగా హ‌త్య.. ఇప్పుడేమో.. : కొడాలి నాని హాట్ కామెంట్స్

చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే రంగా హ‌త్య.. ఇప్పుడేమో.. : కొడాలి నాని హాట్ కామెంట్స్

ప్ర‌భుత్వంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడ‌ల్లా ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అవుతున్నారు. ఆ వ్య‌క్తి చంద్ర‌బాబు అయితే అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఆయ‌న‌తో క‌లిసి న‌డిచిన నాని బాబును పూర్తిగా చ‌దివాన‌ని, ఆయ‌నే వ్యాఖ్య‌లు ఎందుకు చేస్తారో అన్నీ త‌న‌కు తెలుసున‌ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు. అందుకే బాబు ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడ‌ల్లా వాటి వెనుక గ‌ల ఉద్దేశాల‌ను బ‌య‌ట‌పెడుతుంటారు. తాజాగా మ‌రోసారి నాని హాట్ కామెంట్స్ చేశారు. వంగ‌వీటి రంగాను పొట్ట‌న‌పెట్టుకున్న వ్య‌క్తి.. ఇప్పుడు మ‌ళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లోనే రంగా హ‌త్య జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశాన్ని టీడీపీ రాజ‌కీయంగా మ‌లుచుకుంటున్న అంశంపై ఆయ‌న స్పందించారు.

తన హత్యకు రెక్కీ జరిగిందని నా సమక్షంలో రాధా అన్నారని, అందుకే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాధాకు సెక్యూరిటీ ఇప్పించారని, విచారణకు కూడా ఆదేశించారని కొడాలి నాని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దీన్ని రాజకీయంగా లబ్ది పొందాలని చూశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని ఆరోపించారు. ‘నా పార్టీ వేరు రాధా పార్టీ వేరు.. కానీ అతనికి హాని ఉంటే కాపాడాలని అనుకుంటాం. చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రంగా హత్య జరిగింది. ఈ వ్యవహారంలో నాపై విమర్శలు వచ్చాయని నేను అనుకోను. రాజకీయాల్లో విమర్శలు సహజం. చంద్రబాబు ఎయిడ్స్ లాంటి వాడు.’ అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

Also Read : మళ్లీ జగనే సీఎం.. లేదంటే రాజకీయ సన్యాసం.. ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..

అలాగే.. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆర్జీవీపై ఆయన ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఉండి వర్మ ఏమైనా మాట్లాడతాడు. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్లని మేము పట్టించుకోము. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటే అని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ఈ నెల 26న గుడివాడలో వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో పాల్గొన్న వంగవీటి రాధా.. తన హత్యకు కొందరు కుట్ర పన్నారని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధా చేసిన కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వంగవీటి రాధాకు భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు.

బాబు వాస్త‌వాలు తెలుసుకోవాల‌న్న సీపీ

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంపై విజయవాడ సీపీ కాంతి రానా టాటా మరోసారి స్పందించారు. రాధాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ చెప్పారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామన్నారు. పోలీసు అధికారులు రాధాతో మాట్లాడడం జరిగిందన్నారు. ఎలాంటి అఫెన్స్ జరగనపుడు, క్రిమినల్ యాక్టివిటీ లేనపుడు కేసు ఎలా పెడతాం? అని సీపీ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని సీపీ అన్నారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాథమిక ఆధారం లేదన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ రానా చెప్పారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దని ఆయన కోరారు. హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీపీ కాంతి రానా టాటా మరోసారి తేల్చి చెప్పారు.

Also Read : దుర్గి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయాల వెనుక అసలు లక్ష్యాలేంటి