iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికలపై  కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక  వాతావరణం మొదలైంది. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.  ముందుగా అభ్యర్ధులను ప్రకటించి.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల యుద్ధంలోకి దూకింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్ధుల పేర్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. ఇక తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలు ఎప్రిల్, మేలు జరుగుతాయంటూ హాట్ కామెంట్స్ చేశారు.  ఆయన మాట్లాడుతూ.. ఈ అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని, కానీ అక్టోబర్ లో నోటిఫికేషన్ అనుమానమేనని కేటీఆర్ వ్యాఖ్యనించారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిలు, మేలోనే జరగొచ్చు అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ వ్యాఖ్యనించారు. మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే జమిలీ ఎన్నికలు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని కేటీర్ అన్నారు.