iDreamPost

ధర్మపురి శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం!

  • Published Sep 12, 2023 | 12:23 PMUpdated Sep 12, 2023 | 12:23 PM
  • Published Sep 12, 2023 | 12:23 PMUpdated Sep 12, 2023 | 12:23 PM
ధర్మపురి శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం!

ఇటీవల సినీ, రాజకీయ నేతలు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు విషమించి కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. గత నెల తెలంగాణ ప్రజాకవి గద్దర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొన్నిరోజులుగా శ్వాస సంబంధింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యహ్నాం హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శ్వాస సంబంధిత సమస్యతో సోమవారం సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించామని ఆయన చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో వెల్లడించారు. ప్రస్తుతం డీఎస్ కి చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి డీఎస్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. కాగా, డీ. శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగారు. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

డీ.శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన తనయులు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1983లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన డి. శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1989 లో రెండవసారి కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ఘన విజయం సాధించారు. 1998 లో డీఎస్ తొలిసారిగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత బాజిరెడ్డి గోవర్థన్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా డీఎస్ కి తెలంగాణలో మంచి పలుకుబడి ఉంది. అలాంటిది డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి 2018లో టీఆర్ఎస్ పార్టీ చేరిన ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. గత కొంత కాలంగా శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి