దేశంలో పేదల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మగాందీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. 2005 యాక్ట్ తో ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పనులను చేయడాన్ని కరువు పని అని కూడా పిలుస్తారు. పేదలకు పని కల్పించి.. భరోసాను ఇవ్వడమే.. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. అలానే ఈ పథకం ద్వారా పేద ప్రజలు కేంద్రం నుంచి డబ్బులు పొందుతున్నారు. అయితే గత 5 వారాల నుంచి ఉపాధి హామీ పనుల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వాటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. త్వరలోనే ప్రజల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.
ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం 100 పని దినాలు పని కల్పించాలి. అదేవిధంగా ఈ పథకం ద్వారా పని చేసే వారికి కనీస వేతనం కూడా చెల్లించాలి. ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారిగా వారి కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కూడా కేంద్రం నిర్ధిష్ట అమౌంట్ ను నిర్ణయించింది. కేంద్ర నిర్ణయించిన డబ్బులను తరచూ ఉపాధీ కూలీల ఖాతాల్లో జమ అవుతుండేవి. అయితే ఇటీవల కొంత కాలం నుంచి ఉపాధి హామి డబ్బులను పెండింగ్ లో పెట్టారు.
అలా గత కొంతకాలం జాతీయ ఉపాధి హామి పథకం పనులకు హాజరయ్యే కూలీల పెండింగ్ వేతనాలకు సంబంధించి అధికారులు స్పందించారు. 5 వారాలుగా చెల్లింపులు నిలిచిపోగా.. త్వరలో ఉపాధి కూలీల పెండింగ్ నగదు.. వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని గ్రామీణాభివృద్ధి శాక అధికారి తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభమయ్యాయని..త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ జమ అవుతాయన్నారు. మరి… ఉపాధి హామి పథకం విషయంలో అధికారులు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.