Krishna Kowshik
Krishna Kowshik
గురువారం కొంత మంది మొబైల్ యూజర్లను అలర్ట్ చేస్తూ ఓ పెద్ద సౌండ్‌తో కూడిన మేసేజ్ వచ్చింది. అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్లంతా ఆందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ ఎలర్ట్ పేరుతో ఓ సందేశం వచ్చింది. అయితే ఈ మేసేజ్‌ను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(ఎన్డీఎంఎ) పంపింది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మేసేజ్ వస్తోంది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్డీఎంఎ ఈ వ్యవస్థను రూపొందించింది. దీన్ని పరీక్షించే క్రమంలో దేశ వ్యాప్తంగా కొంత మంది యూజర్లకు పెద్ద సౌండ్ తో ప్లాష్ మేసేజ్ సెల్ ఫోన్ స్క్రీన్లపై దర్శనమిచ్చింది. ఆ మేసేజ్ లో టెలీ కమ్యూనిషేకన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్ కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మేసేజ్ అని, దీన్ని పట్టించుకోవద్దని, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు మేసేజ్ చేసినట్లు పేర్కొంది.
అయితే ఈ మేసేజ్ గురించి తెలియక చాలా మంది ఆందోళన చెందారు. పెద్ద పెద్ద సౌండ్స్ తో మేసేజ్ కనపడే సరికి ఓ రకమైన భయం వచ్చింది. కొంత మంది సౌండ్స్ ఎందుకు వస్తుందో తెలియక బిత్తర చూపులు, అయోమయంగా చూశారు. ఇదే అనుభూతిని చవిచూశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతుండగా.. అలారమ్ వినిపించింది. మధ్యలోనే మీటింగ్ ఆపేసిన.. ఆయన ఏదైనా ఫైర్ అలారమా అని ప్రశ్నించారు. అది ఫైర్ అలారం అయితే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరిగి మాట్లాడుతూ..‘ఇది క్లోజ్ ఆడిటోరియం, గుడ్ లక్ గాయ్స్’ అంటూ ఓ రకమైన ఆందోళన వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.