iDreamPost
android-app
ios-app

హమ్మయ్యా … దేవి బ్రతికించాడు

  • Published Dec 27, 2022 | 5:50 PM Updated Updated Dec 27, 2022 | 5:50 PM
హమ్మయ్యా … దేవి బ్రతికించాడు

ఒకప్పుడు వర్షం, శంకర్ దాదా ఎంబిబిఎస్, జల్సా, పరుగు, జులాయి, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం, ఉప్పెన తర్వాత ఆ స్థాయి ఆల్బమ్ ఇవ్వలేకపోయాడు. సరిలేరు నీకెవ్వరు రూపంలో పెద్ద అవకాశం వచ్చినా దాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోలేదు. ఫలితంగా దానికి పోటీగా ఉన్న అల వైకుంఠపురములోతో తమన్ అదిరిపోయే ఛార్ట్ బస్టర్ ఇచ్చాడు. ఇదంతా 2020 సంక్రాంతికి జరిగింది. మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి రావడంతో సహజంగానే దేవి మీద ఒత్తిడి వచ్చింది. అది కూడా వాల్తేరు వీరయ్య లాంటి ప్రాజెక్టుతో

అదృష్టవశాత్తు ఫ్యాన్స్ భయపడినట్టు కాకుండా దేవి మెగాస్టార్ కు హిట్టయ్యే పాటలే ఇచ్చినట్టు రెస్పాన్స్ ని బట్టి అర్థమవుతోంది. నిన్న వచ్చిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు అభిమానుల నుంచే కాక సోషల్ మీడియాలోనూ చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత డిఎస్పి వింటేజ్ బీట్స్ విన్నామని సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే చిరంజీవి మీద దర్శకుడు బాబీ కట్ చేసిన ఎలివేషన్ షాట్స్ ఓ రేంజ్ లో పేలాయి. పుష్పకు మంచి సాహిత్యం ఇచ్చి దాని విజయానికి దోహదపడిన గీత రచయిత చంద్రబోస్ చిరుకి మరోసారి అర్థవంతమైన లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి గాత్రం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది

దీనికన్నా ముందు వచ్చిన వాటిలో బాసూ వెరీజ్ ది పార్టీ ముప్పై అయిదు మిలియన్ల వ్యూస్ తో మూడు వారాలకు పైగా ట్రెండింగ్ లో ఉంది. ముందు నెగటివ్ ట్రోలింగ్ జరిగినా ఫైనల్ గా ఇదే బెస్ట్ సాంగ్ గా నిలిచి ఇన్స్ టా రీల్స్ లో, యుట్యూబ్ షార్ట్స్ లో వైరల్ గా మారింది. తర్వాత నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవికి మిశ్రమ స్పందన దక్కింది. విజువల్ గా ఆకట్టుకుందన్న అంచనాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. కానీ వీటికి మించి వీరయ్య టైటిల్ ట్రాక్ కి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకో రెండు బ్యాలన్స్ ఉన్నాయి. అందులో చిరంజీవి రవితేజ కలయికలో వచ్చే పూనకాలు లోడింగ్ వీటికి రెట్టింపు ఉంటుందనే టాక్ ఉంది. చూడాలి ఎలా ఉంటుందో.