iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు,సినీ నటులకు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలుగు సినీ దిగ్గజ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. చిరంజీవికి కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే  హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

చిరంజీవికి కరోనా అని తేలడంతో పలువురిలో ఆందోళన మొదలయింది. చిరంజీవి మూడు రోజుల క్రితం నాగార్జునతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు. దీంతో వాళ్ళందరూ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారెంటయిన్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆచార్య షూటింగ్ ను కొంతకాలం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగుకి కూడా బ్రేకులు పడే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. కాగా తనకి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.