కోట్లు కొల్లగొట్టిన ‘మెగా’ నమస్తే – Nostalgia

సాధారణంగా మన స్టార్లకు ఒక్కొక్కరికి ఒక్కో బాడీ మ్యానరిజం ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలో పసిగట్టి దానికి అనుగుణంగా రాసుకునే దర్శకుడికే ఒకటికి రెండింతల ఫలితం దక్కుతుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవిని డీల్ చేసేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పట్లో చిరు ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని, ల్యాండ్ మార్క్ డైలాగ్ ని విడిగా రాసేవాళ్ళు. దానికి తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిని మిక్స్ చేసి మెస్మరైజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఈ వరసలో 1992లో వచ్చిన ఘరానా మొగుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

తమిళ్ లో వచ్చిన రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ మన్నన్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డులు సృష్టించిందో లెక్కే లేదు. ఇందులో నమస్తే మ్యాస్టారు అంటూ రావు గోపాల్ రావుకు చిరు విష్ చేసే సీన్ ఓ రేంజ్ లో పేలింది. ఇదొక్కటే కాదు ఫేస్ కొంచెం సైడ్ టర్నింగ్ ఇచ్చుకోమని చెప్పి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చెప్పే విధానం గురించి ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. చాలా కాలం ఈ రెండింటిని యూత్ ఫ్యాషన్ లా ఫాలో అయిన మాట అతిశయోక్తి కాదు. ఘరానా మొగుడులో ఇలాంటి ప్రత్యేకతలే దీన్నో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిలిపాయి. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి 10 కోట్ల షేర్ రాబట్టుకున్న చిత్రంగా ఘరానా మొగుడు సాధించిన రికార్డులు కోకొల్లలు. దీన్నే మళ్ళీ తమిళ్ లో కూడా డబ్ చేశారంటే ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

ఒరిజినల్ వెర్షన్ లో నటించిన రజని ఘరానా మొగుడు చూసి మళ్ళీ నేను దీన్ని రీమేక్ చేసుకున్నా వంద రోజులు ఆడుతుందని కామెంట్ చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఘరానా మొగుడులో చిరంజీవి చూపించే ఈ స్పెషల్ మ్యానరిజంస్ ఏవి మన్నన్ లో ఉండవు. పైగా ఘరానా మొగుడులో కీరవాణి పాటలు సినిమాను చాలా ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇప్పటికీ బంగారు కోడిపెట్ట సాంగ్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది అంటే దీని ప్రత్యేకత ఏమిటో చెప్పనక్కర్లేదు. కాకపోతే ఇప్పటి హీరోలకు ఇలాంటి మ్యానరిజమ్స్ ని దర్శకులు పెట్టలేకపోతున్నారు. పోకిరిలో మహేష్ బాబు చెప్పిన ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో తరహా డైలాగులు అరుదైపోయాయి. ప్రేక్షకుల అభిరుచిలో ఎంత మార్పు వచ్చినా మాస్ ఆడియన్స్ కు మాత్రం గూస్ బంప్స్ ఇచ్చేవి ఇలాంటి మ్యానరిజమ్సే.

Show comments