iDreamPost
android-app
ios-app

ప్రశాంత్‌ నీల్‌కు మెగా ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. ఇప్పట్లో జరిగేనా?

సలార్‌ సాధించిన విజయంతో ప్రశాంత్‌ నీల్‌ క్రేజ్‌ ఆకాశానికి అంటింది. స్టార్‌ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్‌ మాత్రం కమిట్‌ అయిన చిత్రాల మీద దృష్టి పెట్టారు.

సలార్‌ సాధించిన విజయంతో ప్రశాంత్‌ నీల్‌ క్రేజ్‌ ఆకాశానికి అంటింది. స్టార్‌ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్‌ మాత్రం కమిట్‌ అయిన చిత్రాల మీద దృష్టి పెట్టారు.

ప్రశాంత్‌ నీల్‌కు మెగా ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. ఇప్పట్లో జరిగేనా?

కేజీఎఫ్‌ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. తాజాగా ప్రభాస్‌తో ఆయన తీసిన సలార్‌ సాధించిన విజయంతో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. మాస్‌ హీరోగా జనాల గుండెల్లో పాతుకు పోవాలంటే.. ‍ప్రశాంత్‌ చేతిలో పడాల్సిందే అన్న నిశ్చయానికి వచ్చేశారు హీరోలు. అందుకే టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్‌ ఆయనకు ఓ స్పెషల్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

తమ హీరో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కూడా ఓ సినిమా తీయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. అయితే, ప్రశాంత్‌ నీల్‌కు రామ్‌ చరణ్‌తో ఓ మూవీ చేయాలని ఉన్నా.. అది ఇప్పట్లో కాకపోవచ్చు. ఎందుకంటే.. ప్రశాంత్‌ వరుసగా మూడు సినిమాలను ప్రకటించాడు. కేజీఎఫ్‌ చిత్రాల్లో మూడవ భాగం.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా.. ప్రభాస్‌ తాజా సూపర్‌ హిట్‌ సలార్‌కు సీక్వెల్‌ మూవీ లైన్‌లో ఉన్నాయి.

వీటిలో ముందుగా సలార్‌ 2 షూటింగ్‌ జరగనుందని సమాచారం. దాని తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.  ఈ రెండిటి తర్వాత కేజీఎఫ్‌ 3 మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రశాంత్‌ నీల్‌ రామ్‌ చరణ్‌తో సినిమా తీయాలని అనుకున్నా.. ఇందుకు దాదాపు 3 ఏళ్లు పైనే పట్టే అవకాశం ఉంది. కాగా, సలార్‌ సినిమాతో చాలా కాలం తర్వాత ప్రభాస్‌ హిట్‌ను అందుకున్నారు. దాదాపు 5 ఏళ్ల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపుకు ఓ మంచి ప్రతిఫలం దక్కింది.

సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. రెండు ట్రైలర్లు 100 మిలియన్లకుపై వ్యూస్‌ తెచ్చుకున్నాయి. సలార్‌ డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్‌ అయింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఇక, సలార్‌ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రం సినిమాను సలార్‌ రూపంలో మళ్లీ తీస్తున్నాను. ఉగ్రం మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. సినిమా 2014లో విడుదలైంది. ఎక్కువ మందికి రీచ్‌ కాలేదు. అందుకే మళ్లీ తీస్తున్నాను. ప్రభాస్‌కు తగ్గట్టు ఉగ్రం కథలో మార్పులు చేశాను’’ అని అన్నారు. మరి, ప్రశాంత్‌ నీల్‌కు మెగా ఫ్యాన్స్‌ చేస్తున్న రిక్వెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş