iDreamPost
android-app
ios-app

మేజిక్ ఫోటోలో ‘మెగా’ కనెక్షన్ – Nostalgia

  • Published Mar 13, 2020 | 11:04 AM Updated Updated Mar 13, 2020 | 11:04 AM
  • Published Mar 13, 2020 | 11:04 AMUpdated Mar 13, 2020 | 11:04 AM
మేజిక్ ఫోటోలో ‘మెగా’ కనెక్షన్  – Nostalgia

కొన్ని ఫోటోలు యధాలాపంగా అనిపిస్తాయి కానీ తరచి చూస్తే తప్ప అందులోని ప్రత్యేకత అర్థం కాదు. పైన పిక్ కూడా అలాంటిదే. ఇందులో మీకు ఇద్దరు హీరోయిన్లు జయప్రద, శ్రీదేవి ఎలాగూ తెలిసినవాళ్ళే. ఇంకో టీనేజ్ అమ్మాయి నగ్మాని ఈజీగానే గుర్తు పట్టొచ్చు. మరో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కాచెల్లెళ్లు జ్యోతిక, రోషిణిలు. వీళ్ళిద్దరూ తర్వాత హీరోయిన్లుగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ప్రత్యేకత విషయానికి వద్దాం. కాలంతో సంబంధం లేకుండా ఈ ఐదుగురితోనూ హీరోగా జంట కట్టి ఆడిపాడిన హీరో ఒకే ఒక్కరు ఉన్నారు. తనే మెగాస్టార్ చిరంజీవి.

జయప్రద గారితో 47 రోజులు, వేట చేసిన చిరు ఆ తర్వాత శ్రీదేవితో రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పి పరశురామ్ చిత్రాల్లో జోడి కట్టారు. ఇక నగ్మాతో చేసిన ఘరానా మొగుడు సెన్సేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రిక్షావోడులో కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. జయప్రదతో చిరుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు కాని శ్రీదేవితో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ ఇద్దరూ సీనియర్లు కాబట్టి చిరు వాళ్ళతో నటించడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు. కాని ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.

పిల్లల విషయానికి వస్తే ముందుగా రోషిణితో మాస్టర్ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవికి ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుంది. జ్యోతికతో ఠాగూర్ లో చేసిన ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక్కడ ఇంకో సారూప్యత ఉంది. రెండు సినిమాల్లోనూ జ్యోతిక, నగ్మా పాత్రలు చనిపోతాయి. ఇద్దరికీ చిరుతో ఒక పాట మాత్రమే ఉంటుంది. రెండూ బ్లాక్ బస్టర్ మూవీసే. మాస్టర్, ఠాగూర్ లో చిరంజీవి కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్ గా కనిపిస్తారు. ఇలా ఈ ఫోటోలో ఉన్న ఐదుగురితో జట్టు కట్టిన ఒకే ఒక్క హీరోగా చిరంజీవి ప్రత్యేకంగా నిలిచిపోయారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయనతోనే డ్యూయెట్లు పాడిన తరహాలో ఇక్కడ చిన్నపిల్లలుగా కనిపించిన పాపలు ఆ తర్వాత చిరుతో హీరోయిన్ గా నటిస్తారని జయప్రద, శ్రీదేవిలైనా ఊహించి ఉండరుగా. అదే సినిమా విచిత్రాలంటే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet