iDreamPost
android-app
ios-app

MBA డ్రాపౌట్.. నెలకు రూ.13 లక్షల ఆదాయం!

ఈ మధ్యకాలంలో సొంత వ్యాపారం చేయాలనే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకే ఉద్యోగాలు మానేసి బిజినెస్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ అనేక మంది విజేతల స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎంబీఏ డ్రాఫౌట్ అయిన వ్యక్తి నెలకు రూ.13 లక్షల ఆదాయం సాధిస్తూ వార్తల్లో నిలిచారు.

ఈ మధ్యకాలంలో సొంత వ్యాపారం చేయాలనే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకే ఉద్యోగాలు మానేసి బిజినెస్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ అనేక మంది విజేతల స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎంబీఏ డ్రాఫౌట్ అయిన వ్యక్తి నెలకు రూ.13 లక్షల ఆదాయం సాధిస్తూ వార్తల్లో నిలిచారు.

MBA డ్రాపౌట్.. నెలకు రూ.13 లక్షల ఆదాయం!

నేటికాలంలో చాలా మంది యువతకు సొంతగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే కొందరు మాత్రమే అటువైపుగా అడుగులు వేస్తారు. మరికొందరు అయితే తమ జీవన స్థితి మారేందుకు అద్భుతమైన వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే విజయం సాధించి..నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. అయితే కేవలం బాగా చదువుకున్న వాళ్లు మాత్రమే మంచి స్థాయికి వెళ్తారనుకుంటే పొరపాటే. ఎంబీఏ డ్రాపౌట్ అయినా ఓ యువకుడు..తన వ్యాపార ఆలోచనలు ఆచరణలో పెట్టి.. నెలకు రూ.13 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి.. ఆ విజేత వివరాలు ఏమిటో ఇప్పుడు  తెలుసుకుందాం..

రాజస్థాన్ కి చెందిన శంకర్ మీన కి చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. ఆ దిశగానే తన అడుగులు ముందుకు వేశాడు. 2013లో ఎంబీఏ ఫినాన్స్ చదివాడు. అయితే శంకర్ మీన ఎంబీఏలో డ్రాఫౌట్ అయ్యారు. అతడి కుటుంబం వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తుంది. అయితే వారికి వచ్చే ఆదాయం ఎప్పుడు కుటుంబానికి సరిపోయేది కాదు. శంకర్ మీనా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండేవి. ఇదే సమయంలో తన కుటుంబ స్థితిని మార్చాలని శంకర్ భావించాడు. వ్యాపారం ద్వారా ఎక్కువ సంపాదించ వచ్చని శంకర్ భావించాడు. ఆ ఆలోచనతోనే ఎంబీఏలో చేరాడు. అయితే ఆ చదువుపై అతడికి ఆసక్తి లేదంట.  ఎప్పుడు చూడు వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలే వచ్చేవి ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే బీకామ్ కామర్స్ ను పూర్తి చేశాడు.

mba drop out earning 13lakhs per month

అనంతరం చాలా మంది రైతులు, వివిధ రకాల ప్రజలతో శంకర్ మీన సమావేశం అయ్యాడు. వారి నుంచి అనేక ఆలోచనలు, సూచనలు శంకర్ మీన తీసుకున్నారు. చివరకు పుట్ట గొడుకుల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2016లో ఐసీఓఆర్ అనే  రీసెర్చ్ సెంటర్లకు వెళ్లి మష్రూమ్స్ పై పట్టు సాధించారు. తినదగిన, ఔషధ పుట్టగొడుగుల సేకరణ, సంరక్షణ, వినియోగం, ఉత్పత్తి వంటి అంశాలపై శంకర్ మీన పట్టు సాధించారు. అనంతరం ఇంటి వద్ద సాగు ప్రారంభించారు. 2017లో జీవన్ మష్రూమ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా పుట్టగొడుకు విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అనంతరం హర్యానాలో, బెంగుళూరులో  వ్యవసాయానికి సంబంధించిన శిక్షణలో పాల్గొని.. అక్కడి సూచనను పాటించారు. ఇక తాను ప్రారంభించిన జీవన్ మష్రూమ్ సంస్థ విదేశాలకూ విస్తరించింది.

కొత్తగా ప్రారంభించిన కొత్త యూనిట్ నెలకు 80టన్నుల మాష్రూమ్స్ సీడ్స్ ను ఉత్పత్తి చేస్తోంది.  తన వ్యాపారంలో అనేక విజయాలు సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో పలు వ్యవసాయ అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ నెలకు రూ.13 లక్షలు సంపాదిస్తున్నారు. పుట్టగొడులు జాతులను అందరికీ పరిచయంచేసి.. వారికి ఆదాయం తేవడమే లక్ష్యమంటున్నారు. ఇక ఈ వ్యాపారం అభివృద్ధి చెందడంలో అతడి భార్య కాంచన ఎంతో మద్దతుగా నిలబడ్డారని శంకర్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తమ నెలవారీ ఆదాయం దాదాపు రూ. 13 లక్షలు ఉందని, కొత్త సౌకర్యంతో ఇది కనీసం ఐదు రెట్లు పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్లు శంకర్ మీన తెలిపారు. మరి..ఎంబీఏ డ్రాఫౌట్ అయినా కూడా నెలకు రూ.13 లక్షలు ఆదాయం సంపాదిస్తున్న శంకర్ మీనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.