iDreamPost
android-app
ios-app

Matti Kusthi మట్టి కుస్తీ రిపోర్ట్

  • Published Dec 03, 2022 | 1:35 PM Updated Updated Dec 03, 2022 | 1:35 PM
Matti Kusthi మట్టి కుస్తీ రిపోర్ట్

మనకు అంతగా పరిచయం లేని తమిళ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమా నిన్న హిట్ 2తో పాటు థియేటర్లలో విడుదలయ్యింది. నిర్మాతగా రవితేజ టేకప్ చేసిన మరో ప్రాజెక్టు ఇది. డబ్బింగ్ మూవీ కావడంతో మన జనానికి దీని మీద ఏమంత ఆసక్తి లేకపోయింది. ప్రమోషన్లలో చూపించిన కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నప్పటీకే ఇదేదో స్పోర్ట్స్ డ్రామాలా ఉందన్న ఫీలింగ్ తో ఆడియన్స్ టాక్ కోసం ఎదురు చూశారు. బెల్లంకొండ రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ చేసింది ఈ విష్ణు విశాలే. ఆ మధ్య ఎఫ్ఐఆర్ అనే మూవీతో వచ్చాడు కానీ అది మరీ గొప్పగా ఆడకపోవడంతో పూర్తి స్థాయిలో రిజిస్టర్ కాలేకపోయాడు. మరి ఈ మట్టి కుస్తీ టైటిల్ కు తగ్గట్టు మెప్పించిందా లేదా చూద్దాం

పల్లెటూళ్ళో జులాయిగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసే వీరు(విష్ణు విశాల్)కి పెళ్లి విషయంలో కొన్ని ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. తనకంటే తక్కువ చదివి పొడవు జడ ఉంటేనే చేసుకోవాలని భీష్మించుకోవడంతో సంబంధాలు దొరకవు. దీనికి పూర్తి విరుద్ధంగా బాయ్ కట్ తో కుస్తీ పోటీల్లో పాల్గొనే బిఎస్సి చదివిన కీర్తి(ఐశ్వర్య లక్ష్మి)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తీరా చూస్తే ఆ అమ్మాయికి తాను కోరుకున్నవి లేవని తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. చివరికి కీర్తితోనే వీర కుస్తీ పోటీకి దిగాల్సిన స్థాయికి చేరుకుంటుంది. భార్యాభర్తల మధ ఉన్న సమస్య ఏంటి, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిణామాలు ఎలా కలిగాయనేదే స్టోరీ.

ఎంటర్ టైన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. దర్శకుడు చెల్లా అయ్యావు ఇందులో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ దాకా పెద్దగా బోర్ కొట్టించుకుండా అంచనాలు లేనివాళ్లకు ఓ మోస్తరుగా నచ్చేలా సాగుతుంది. వీర కీర్తిల నిజాలు బయటపడ్డాక అక్కడి నుంచి జరిగే డ్రామా మరీ సాధారణంగా ఉండటంతో పాటు ఎమోషనల్ సీన్లు ఆశించిన స్థాయిలో పండలేదు. క్లైమాక్స్ ఘట్టం ఫన్నీగా ఉన్నా ఓకే అనిపిస్తుంది. సంగీతం పరంగా జస్టిన్ ప్రభారకరన్ మంచి స్కోర్ ఇచ్చాడు. అన్ని అంశాలు బ్యాలన్స్ చేయాలనే ప్రయత్నం అంతగా వర్కౌట్ కాలేదు. ఇంకే ఆప్షన్ లేదు ఖచ్చితంగా థియేటర్లో ఏదో ఒక సినిమా చూడాలంటే మట్టి కుస్తీని ట్రై చేయొచ్చు