iDreamPost
android-app
ios-app

సూయిజ్ కాలువలో సునామీ

సూయిజ్ కాలువలో సునామీ

ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఇరుక్కుపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన ‘ఎంవీ ఎవర్‌గివెన్’ ప్రమాదవశాత్తు సూయిజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ఇతర నౌకల రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది.

ఇది ప్రపంచ వాణిజ్య పైన పైన ప్రభావం చూపనుంది.

400 మీటర్ల పొడవున్న ఈ అతి పెద్దనౌక 2.20 లక్షల టన్నులతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో సూయాజ్ కాలువలో చిక్కుకుపోయింది. ఓడ తూర్పు పైభాగం తూర్పు గోడను, కింది భాగం పశ్చిమ గోడను తాకటంతో అక్కడే ఇరుక్కుపోయి కదలకుండా నిలిచిపోయింది. ఇటువంటి ఘటన జరిగటం గత 150 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సూయిజ్ కాలవ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. ఈ క్రమంలో నౌక చిక్కుకుపోవటంతో ఇతర నౌకల రాకపోకలకు అంతరాయి ఏర్పడింది. చిక్కుకుపోయిన నౌకను తిరిగి యథాస్థితిలోకి తీసుకురావటానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాల్సిన ఇతర నౌకలపై సముద్రపు దొంగలు దాడిచేసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.తగిన ఏర్పాట్లు చేశారు.

సూయజ్ కెనాల్ లో భారీ షిప్ ఇరుక్కు పోవడానికి గంటకు 47 మైళ్ళ వేగం తో వీచిన గాలుల దెబ్బకి అడ్డం తిరిగి ఒకవైపు ఒడ్డు ని ఢీ కొట్టి ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆగిపోవడమే కాదు 100 కు పైగా మిగతా షిప్పులను బ్లాక్ చేసింది. ఆ రూట్ లో ప్రపంచం లో జరిగే ట్రేడ్ మొత్తం లో 10-12% ఆ రూట్ నుంచే వస్తుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ సూయిజ్ కాలువ మీదుగానే సరఫరా అవుతుంటాయి.

ఆసియా ఆఫ్రికా ఖండాలను విభజించేలా సన్నటి రేఖలా కనిపించే సుయిజ్ కాలువను 1869లో ప్రారంభించారు. నార్త్ అట్లాంటిక్ నుంచి ఇండియన్ ఓషన్ లోకి సులువుగా వచ్చేందుకు మధ్యధరా సముద్రం, రెడ్ సీ లకుk అనుసంధానంగా ఈ కాలువ ఉపయోగపడుతుంది. దక్షిణ అట్లాంటిక్ నుంచి ఇండియన్ ఓషన్ లోకి ప్రవేశించడానికి సుమారు 8 వేల ఐదు వందల కిలోమీటర్ల మేర దగ్గరదారి గా దీనిని పేర్కొంటారు. దీంతో లండన్ మీదుగా అరేబియన్ సముద్రం లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాణిజ్యం సులభతరమవుతుంది. 193 మీటర్ల పొడవు ఉన్న సుయిజ్ కాలువ 77 మీటర్లు వెడల్పు మాత్రమే ఉంటుంది. 49 నుంచి 97 పెద్ద ఓడలు దీని మీదుగా రోజువారీ ప్రయాణిస్తుంటాయి.

దీని మీదుగా వెళ్లాలంటే మొదట ఖచ్చితంగా సూయజ్ కాలువ అధారిటీ అనుమతి తీసుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈజిప్టు ప్రభుత్వం చేతిలో ఉండే ఈ అధికారం వల్ల ఆదేశంతో చాలా దేశాలు సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాయి. అంత కీలకమైన కాలువలో ఇప్పుడు ఒకేసారి కార్యకలాపాలు ఆగిపోవడం వల్ల అన్ని దేశాలకు ఇబ్బందులు తప్పవు. చాలా తక్కువ వెడల్పులో ఉండే ఈ కాలువలో నుంచి ఇరుక్కుపోయిన అతిపెద్ద బోట్లు తప్పించడం చాలా కష్టతరమే. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక తో ప్రయత్నాలు సాగిస్తున్న అవి ఎప్పుడు పూర్తవుతాయి అన్నది మాత్రం అంతు పట్టడం లేదు.