iDreamPost

Khiladi : గెట్ రెడీ “మాస్ మహారాజా” ఫాన్స్..ఖిలాడీ వస్తున్నాడు.

Khiladi : గెట్ రెడీ “మాస్ మహారాజా” ఫాన్స్..ఖిలాడీ వస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఖిలాడీ చిత్రం కాగా మరొకటి రామారావు ఆన్ డ్యూటీ..ఇవే కాకుండా, హీరో రామ్ నటించిన “హలో గురు ప్రేమ కోసమే” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధ్ రావు నక్కినతో కూడా ఒక చిత్రాన్నిఒకే చేశారు మన మాస్ మహారాజ. మరికొన్ని సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. రవితేజ తన తదుపరి చిత్రం ఖిలాడి కోసం సమయం ఇవ్వడం లేదని ఈమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సినిమా షూటింగ్‌కి కొంత సమయం కేటాయించాడు ఈ హీరో.

తాజా సమాచారం ప్రకారం, రవితేజ రేపటి నుండి ఒక ఆసక్తికరమైన డ్యాన్స్ నంబర్ కోసం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుందని ఫిలింనగర్ టాక్. ఈ సాంగ్ షూటింగ్‌లో రవితేజతో పాటు కథానాయిక మీనాక్షి చౌదరి కూడా పాల్గొంటుంది. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. “క్రాక్” సినిమా సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read : OTT Subscription Prices : ఓటిటిల మధ్య ధరల పోటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి