iDreamPost
android-app
ios-app

పక్కాగా నేర్చుకోవాల్సిన పాఠం

  • Published Jul 07, 2022 | 1:11 PM Updated Updated Jul 07, 2022 | 1:11 PM
  • Published Jul 07, 2022 | 1:11 PMUpdated Jul 07, 2022 | 1:11 PM
పక్కాగా నేర్చుకోవాల్సిన పాఠం

ప్రమోషన్లతో ఊదరగొట్టి మాస్ కి కిక్కిచ్చే, వెంట్రుకలు నిక్కబొడుచుకునే సినిమా తీశామని పదే పదే చెప్పుకున్న పక్కా కమర్షియల్ ఎట్టకేలకు మారుతీకి దిగ్విజయంగా మంచి రోజులు వచ్చాయి తర్వాత రెండో ఫ్లాపుని ఇచ్చేసింది. సక్సెస్ మీట్ పేరుతో టీమ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ దాని తాలూకు ప్రభావం బాక్సాఫీస్ వద్ద సున్నానే. భారీ నష్టాలు తప్పవని అర్థమైపోయింది.

మ్యాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడీ ఫలితం వల్ల మార్కెట్ మరింతగా మైనస్ అయ్యిందే తప్ప ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తారని పక్కా కమర్షియల్ మరోసారి ఋజువు చేసింది. అతి మాములు జోకులు కోసం జనం థియేటర్లకు వచ్చేంత సీన్ లేదని కలెక్షన్లు నిరూపించాయి.

అసలే పోటీ లేకపోయినా ఇంత క్యాస్టింగ్ ఉన్న ఇలాంటి సినిమాకి బ్రేక్ ఈవెన్ చేరుకునే పరిస్థితి లేకపోవడం విచారకరం. అసలే మారుతీ నెక్స్ట్ ప్రభాస్, చిరంజీవిలను హ్యాండిల్ చేయబోతున్నాడు. ఆషామాషీ రైటింగ్ తో వీళ్ళను రిస్క్ లో పెట్టలేం. ప్రెజెంటేషన్ బలంగా ఉంటేనే రిజల్ట్స్ బాగుంటాయి. రాధే శ్యామ్, ఆచార్యలు ఏమయ్యాయో చూశాం. సో ఈ పక్కా పాఠం నేర్చుకుని నెక్స్ట్ జాగ్రత్త పడితే బెటర్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş