మణిరత్నం ఆ మేజిక్ చేయగలరా

ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే చాలు హీరో ఎవరని చూడకుండా మరీ థియేటర్ కు వెళ్లిపోయే రోజులు. నాగార్జున లాంటి స్టార్ హీరోని రోగిష్టిగా చూపించినా, మహాభారత గాథలోని కర్ణుడి కథను దళపతిగా తీసినా, వ్యాధితో చావుకు దగ్గరైన పాపని అంజలిగా చూపించినా, మాఫియా డాన్ కథలో ఎమోషన్స్ ని నాయకుడిగా పండించినా వాటిని మాస్టర్ పీసెస్ గా మలిచిన ఘనత ఈయనకే దక్కుతుంది. కానీ ఇదంతా గతం.

మణిరత్నం కొన్నేళ్లుగా తన మేజిక్ ని కోల్పోయారు. ఓకే బంగారం తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ ఏదీ లేదు. చెలియా, నవాబ్ టాలీవుడ్ లో దారుణంగా బోల్తా కొట్టాయి. ఇప్పుడు తాజాగా పొన్నియన్ సెల్వన్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు మణి. ఇది మల్టీ స్టారర్ పీరియాడిక్ డ్రామా. విక్రమ్, ఐశ్వర్య రాయ్ కార్తీ, త్రిష, జయం రవి, విక్రమ్ ప్రభు, ఆది పినిశెట్టిలతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటిసారి మణి దర్శకత్వంలో నటిస్తున్నారు

ఇటీవలే థాయిలాండ్ లో మొదటి షెడ్యూల్ సైలెంట్ గా పూర్తి చేసుకుంది పొన్నియన్ సెల్వన్. ఇది సుప్రసిద్ధ రచయిత కల్కి నవల ఆధారంగా రూపొందుతోంది. తెలుగు వెర్షన్ టైటిల్ తదితర అప్ డేట్స్ ఇంకా బయటికి రాలేదు. నేటివిటీ పరంగా ఇది మన కథ కాదు. కనెక్ట్ అవ్వడం కూడా అంత సులభం కాదు. అయితే ఇది తమిళ వీరుడి కథగా కాకుండా బాహుబలి తరహాలో ఫాంటసీ డ్రామాని జోడించి పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ మూవీతో వస్తున్న మణిరత్నం తనలో మునుపటి మేజిక్ ఇంకా సజీవంగా ఉందని ప్రూవ్ చేయాలంటే పొన్నియన్ సెల్వన్ ఇండస్ట్రీ హిట్ స్థాయిలో సక్సెస్ అవ్వాలి.

Show comments