iDreamPost
android-app
ios-app

Rajinikanth: ఆ మూవీలో నేను సరిగ్గా నటించలేదన్నారు! షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్!

  • Published Aug 22, 2024 | 9:20 PM Updated Updated Aug 22, 2024 | 9:20 PM

ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేదని డైరెక్టర్ నాపై అసంతృప్తిని వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. మరి ఆ మూవీ ఏది? ఆ డైరెక్టర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేదని డైరెక్టర్ నాపై అసంతృప్తిని వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. మరి ఆ మూవీ ఏది? ఆ డైరెక్టర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 22, 2024 | 9:20 PMUpdated Aug 22, 2024 | 9:20 PM
Rajinikanth: ఆ మూవీలో నేను సరిగ్గా నటించలేదన్నారు! షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు చెబితే చాలు.. ఆయన స్టైల్ కు సంబంధించిన విజువల్స్ మన మైండ్ లో మెదులుతాయి. ఇక తన నటనతో ఇండియాలోనే కాక.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సెలబ్రిటీలు సైతం ఆయనకు ఫ్యాన్స్ గా ఉన్నారు. ఇలాంటి లెజెండరీ యాక్టర్ కు ఓ సందర్భంలో ఓ సంఘటన ఎదురైంది. ఆ మూవీలో సరిగ్గా నటించలేదని డైరెక్టర్ రజినీ నటనపై అసంతృప్తిని వ్యక్తం చేశాడట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఆ డైరెక్టర్ ఎవరు?

మణిరత్నం.. భారతీయ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరొందుతున్నాడు. ఇక ఈ లెజెండ్ డైెరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ ‘దళపతి’. 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నాడు రజినీకాంత్. ఓ సీన్ కోసం కమల్ హాసన్ హెల్ప్ తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మూవీలో ఓ సీన్ సరిగ్గా చేయలేదని మణిరత్నం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించాడు.

Rajiniakanth about dalapathy moments

రజినీకాంత్ మాట్లాడుతూ..”దళపతి మూవీలో నేను రాజకీయ నాయకుడికి సవాల్ విసిరే సీన్ ఒకటుంది. ఆ సీన్ అద్భుతంగా రావాలని మణిరత్నం పట్టుబట్టారు. నేను లెక్కలేనన్ని టేక్స్ తీసుకున్నాను. అయినా సీన్ సరిగ్గా రాలేదని, నేను సరిగ్గా నటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మణిరత్నం. చాలా నిరాశకు గురైయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్ కమల్ హాసన్ కు ఫోన్ చేసి సలహా అడిగాను. అతడు వెంటనే ఆ సీన్ ను మణిరత్నంని చేసి చూపించు అని సలహా ఇచ్చాడు. దాంతో నా ప్రాబ్లం తీరింది. ఆ విషయంలో నేను కమల్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు సూపర్ స్టార్. ఇక ప్రస్తుతం రజినీ వెట్టయాన్, కూలీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet