iDreamPost
android-app
ios-app

మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ సూపర్ స్టార్ @ మార్చ్ 23

మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ సూపర్ స్టార్ @ మార్చ్ 23

సూపర్ స్టార్ రజినీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసయాత్రలతో సందడి చేసిన “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ట్రైలర్ విడుదలయ్యింది. డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.

ఈ కార్యక్రమం చిత్రీకరణ కర్ణాటకలోని బండిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగింది. గతంలో జరిగిన ఈ కార్యక్రమం చిత్రీకరణలో రజినీకాంత్ కు గాయాలయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. డిస్కవరీ ఛానెల్ విడుదల చేసిన ట్రైలర్ లో రజిని సాహసయాత్రలో భాగంగా కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు రజినీకాంత్.

కాగా బేర్ గ్రిల్స్ రజినీకాంత్ తో సాహసయాత్రను ప్రస్తావిస్తూ, రజనీకాంత్ సానుకూల దృక్పథంతో ఉంటారని, ప్రతి సవాలును ధైర్యంగా స్వీకరించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మార్చ్ 23 న రాత్రి 8.00 లకు డిస్కవరీ ఛానెల్ లో రజినీకాంత్ బేర్ గ్రిల్స్ తో చేసిన సాహసయాత్ర పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

గతంలో బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో చేసిన సాహసయాత్రకు మంచి గుర్తింపు లభించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో కనిపించరు. నరేంద్ర మోడీ తరువాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్ తో సాహసయాత్రలో పాల్గొన్న రెండో భారతీయుడిగా రజినీకాంత్ నిలిచారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet