కరోనా మహమ్మారితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనేక విధాలుగా నష్టపోయారు. ఆ ఇబ్బందుల్ని దాటుకొని తిరిగి యథావిధిగా ప్రజల జనజీవనం కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు “మంకీపాక్స్” ప్రజల్ని హడెలత్తిస్తోంది. తాజాగా మంకీపాక్స్ ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించడంతో కొత్త భయాలు మొదలయ్యాయి.
ఇప్పుడు తొలిసారిగా ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ రెండు వైరస్ లక్షణాలు కనిపించడం మరింత భయపెడుతోంది. అమెరికాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ రెండు వైరస్ లను గుర్తించారు. ముందుగా కరోనా లక్షణాలు కనిపించగా, తరువాత చేసిన పరీక్షల్లో మంకీపాక్స్ వైరస్ ను సైతం గుర్తించారు.
అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ఒకవైపు కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సందర్భంలో మంకీపాక్స్ సైతం ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
వివిధ దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారికి సైతం ఇది సోకుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.