iDreamPost
android-app
ios-app

వీడియో: సినిమాకు వెళుతూ ఉన్నట్టుండి కుప్పకూలాడు!

వీడియో: సినిమాకు వెళుతూ ఉన్నట్టుండి కుప్పకూలాడు!

ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు బాగా ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల వరకు ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. వీటిలో సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్టుండి చనిపోతున్నారు. ప్రతినిత్యం దేశంలోని ఎక్కడో ఓ చోట గుండెపోటు కారణంగా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి సినిమాకు వెళుతూ గుండెపోటుకు గురయ్యాడు.

అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని లఖిమ్‌పుర్‌ ఖేరీకి చెందిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం సినిమాకు వెళుతూ ఉన్నాడు. మాల్‌కు చేరుకుని సినిమా థియేటర్‌ ఉన్న వైపు నడుస్తూ ఉన్నాడు. అతడు ఫోన్‌లో మాట్లాడుతూ.. నడుస్తూ ఉన్నాడు. మాల్‌లో ఓ చోట ఫుడ్‌ కోర్టు దగ్గరకు చేరుకున్నాడు. ఫోన్‌ మాట్లాడుతూనే ఉన్నట్టుండి అక్కడే ఉన్న టేబుల్‌, కుర్చీల మీద దబ్‌మని పడ్డాడు. అతడి ముందు వెళుతున్న వాళ్లు అతడ్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. అతడు లేవలేదు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.

అంబులెన్స్‌లో అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆ వ్యక్తి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు ‘‘ ఏం గుండెపోటులో ఏమో.. ఎవ్వరినీ వదలటం లేదు’’.. ‘‘ ఈ మధ్య కాలంలో గుండెపోట్లు ఎక్కువయ్యాయి’’.. ‘‘ఇలాంటి చూస్తుంటే నిజం భయం వేస్తోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన గుండెపోటు​ మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.