iDreamPost
android-app
ios-app

ఖాకీల కావరం.. బూటుకాలుతో తలను తొక్కి పెట్టి..

అండగా ఉండాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ సామాన్య వ్యక్తిని చావబాదారు. బూటుకాలుతో తలను తొక్కిపెట్టి చితకబాదారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ మూర్ఖంగా వ్యవహరించారు.

అండగా ఉండాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ సామాన్య వ్యక్తిని చావబాదారు. బూటుకాలుతో తలను తొక్కిపెట్టి చితకబాదారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ మూర్ఖంగా వ్యవహరించారు.

ఖాకీల కావరం.. బూటుకాలుతో తలను తొక్కి పెట్టి..

రక్షించాల్సిన పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అయితే పోలీసులు అందరూ ఇంతేనా అంటే కాదనే చెప్పాలి. మానవత్వం చాటే పోలీసులు ఎంతో మంది ఉన్నారు. కొంత మంది మాత్రమే ఇలా రూడ్ గా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో పోలీసులపై గౌరవం పోయేలా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. ఓ సామాన్య వ్యక్తిపై ఘోరంగా దాడికిపాల్పడ్డారు. బూటుకాళ్లతో తన్నుతూ చావబాదారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ మూర్ఖంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

యూపీలో ఇద్దరు హోంగార్డులు రెచ్చిపోయారు. అందరు చూస్తుండగానే ఓ దళిత వ్యక్తిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఏమాత్రం కనికరం లేకుండా కిందపడేసి బూటుకాలితో తలను తొక్కిపెట్టి తప ప్రతాపం చూపించారు. చేతిలో ఉన్న రైఫిల్ తో దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బహోరంగాల గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ జాతవ్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. దళిత వర్గానికి చెందిన అతడు భూమి దస్తావేజు కోసం తహసీల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న హోంగార్డులు వీరేంద్ర కుమార్‌ను కులం పేరుతో దూషించారు. ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

హోంగార్డులు చేసిన వ్యాఖ్యలపై దళిత వ్యక్తి వీరేంద్ర కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఇద్దరు హోంగార్డులు అతడిపై దాడి చేశారు. అంతా చూస్తుండగా కిందపడేసి రైఫిల్‌ బట్‌తో చావు దెబ్బలు కొట్టారు. బూటు కాళ్లతో కర్కశంగా తన్నారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఖాకీల కావరాన్ని ప్రదర్శించారు. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. ఇంకేముంది క్షణాల్లో నెట్టింటా వైరల్ గా మారింది. దళిత వ్యక్తిపై దాడికి పాల్పడ్డ హోంగార్డులు వీర్ బహదూర్, రాంపాల్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. హోంగార్డులు దళిత వ్యక్తిపై దాడికి పాల్పడిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.