iDreamPost
android-app
ios-app

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ – బిట్ కాయిన్ పేమెంట్

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ – బిట్ కాయిన్ పేమెంట్

మనదేశంలో సైబర్ నేరాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. చిన్న చిన్న వస్తువుల పేరుతో లక్షలు లక్షలు మోసం చేసే వరకే ఉన్న సంస్కృతి ఇప్పుడు సైబర్ అటాక్ తో ఏకంగా బ్యాంకు లను టార్గెట్ చేసే స్థాయికి వెళ్ళింది. మహేష్ బ్యాంకు వ్యవహారం దెబ్బకు బ్యాంకింగ్ రంగం మొత్తం కంగారు పడింది. తమ వినియోగదారుల భద్రతతో పాటుగా తమ సొమ్ము పై బ్యాంకు లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకు లు అయితే హ్యాకింగ్ నిపుణులను కూడా రంగంలోకి దించి భారీగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతూ… హ్యాకింగ్ బారి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. మహేష్ బ్యాంకు వ్యవహారం తర్వాత బ్యాంకులకు సాఫ్ట్ వేర్ అందించే సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఆలోచనలో పడ్డాయి. ఇక మహేష్ బ్యాంకు విచారణకు సంబంధించి దూకుడుపెంచిన తెలంగాణ పోలీసులు… మహేష్ బ్యాంక్ కేసులో కింగ్ పిన్ యూపీకి చెందిన లక్కీగా పోలీసులు తేల్చి అతన్ని టార్గెట్ చేశారు. డార్క్ నెట్ వెబ్సైట్ ద్వారా నైజీరియన్స్ కు ఆఫర్ ఇచ్చాడని పోలీసుల విచారణలో బయటపడింది.

బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేయగలిగే వారికోసం ప్రకటనలు ఇవ్వడంతో నైజీరియా వారిని ఆకట్టుకున్నాడు. టచ్ లోకి వచ్చిన నలుగురు నైజీరియన్స్ తో డీల్ హై రేంజ్ లో మాట్లాడాడు. భారీ స్కాం కోసం పక్కా ప్లాన్ చేశాడు. ఆ తర్వాతే హ్యాకింగ్ స్కెచ్ గీసి జాగ్రత్తగా అమలు చేశారు. బ్యాంక్ చెస్ట్ ఖాతా నుండి నాలుగు ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన షానాజ్, వినోద్, సంపత్, నవీన్ లకు చెందిన కరెంట్ అకౌంట్స్ ను కమీషన్ ఆశ చూపించి వాడుకున్నారు.

బిట్ కాయిన్స్ రూపంలో కమీషన్ చెల్లించడం సంచలనం అయింది. ఇప్పటి వరకు సైబర్ క్రైమ్స్ లో బిట్ కాయిన్ కమీషన్ అనే మాట రాలేదు. అనంతరం 128 అకౌంట్స్ కి మొత్తం 12.93 కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు. ఇప్పటికే ఇద్దరు నైజీరియన్స్ సహా పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ లక్నోకి చెందిన కీలక నిందితుడు లక్కీ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. అతనికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలలో గాలించే పోలీసులకు ఇది పెద్ద సవాల్ గా మారింది.

Also Read : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఫ్రాడ్ కేసు.. సీబీఐ చరిత్రలో ఇదే మొదటి సారి?