iDreamPost
iDreamPost
ఒకపక్క బిగ్ బాస్ సీజన్ 4ని అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడన్న వార్త ఇంకా ప్రచారంలో ఉండగానే లేదు మహేష్ బాబు యాంకర్ అవతారం ఎత్తుతాడని వచ్చిన వార్త ఇద్దరి అభిమానుల్లోనూ అయోమయం రేపుతోంది. మార్కెట్ పరంగా ఎవరికి అందంత ఎత్తులో ఉన్న మహేష్ అసలు బుల్లితెరవైపు ఎందుకు చూస్తున్నాడన్న ప్రశ్నలో అందరిలోనూ తలెత్తుతోంది. ఇటీవలే కొన్ని టీవీ సీరియల్స్ కు బ్రాండ్ అంబాసడర్ గా మారి వాటి యాడ్స్ లో నటించడం మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి. కంపనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే పర్వాలేదు కాని ఇలా సీరియల్స్ చూడమని చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.
ఇదిలా ఉండగానే ఇప్పుడు బిగ్ బాస్ 4 గురించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నాగార్జునే కొత్త సిరీస్ నడిపిస్తాడనే టాక్ ఉండగా ఇప్పుడీ వార్త ఎలా వచ్చిందో అర్థం కాక అనవసరమైన కన్ఫ్యూజన్ రేగుతోంది. నిజానికి మహేష్ ఇప్పుడు బుల్లితెరపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ సాఫ్ట్ నేచర్ తో వ్యవహరించే ప్రిన్స్ కు బిగ్ బాస్ ఫార్మాట్ సూట్ కాదు. ఇప్పటి జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దాన్ని సమర్దవంతంగా నడిపించాడు. నానికి ఫలితం దక్కలేదు. నాగార్జున సీనియర్ కాబట్టి పోల్చకూడదు.
మరి వివాదాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మధ్య నడిచే బిగ్ బాస్ వ్యవహరాలు మహేష్ కు అంతగా నప్పేవి కాదు. మరి నిజంగా స్టార్ మా ఆ ప్రతిపాదన మహేష్ దగ్గరికి తీసుకెళ్ళిందో లేదో కాని పుకార్లకు మాత్రం గట్టి రెక్కలు మొలిచాయి. సీజన్ 3 టైంలోనూ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి చాలా పేర్లు వినిపించాయి కాని ఫైనల్ గా బాల్ నాగ్ వద్దకే వచ్చి ఆగింది. ఇవన్ని పక్కనబెడితే తమ సూపర్ స్టార్ హీరోని పదే పదే బుల్లితెరపై చూసుకోవడం ఇష్టం లేదని అధిక శాతం అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇక మహేష్ ఆచార్యలో నటించే విషయంలో, కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే అంశాల్లో ఇంకా క్లారిటీ రాలేదు కాని అప్పుడే బిగ్ బాస్ రచ్చ మొదలైపోయింది.