పోకిరి ప్రభంజనం – పరిశ్రమకు పాఠం

హైదరాబాద్ సుదర్శన్ తో మొదలుపెడితే కర్నూలు శ్రీరామా థియేటర్ దాకా అన్ని చోట్లా ఒకే దృశ్యం.

హైదరాబాద్ సుదర్శన్ తో మొదలుపెడితే కర్నూలు శ్రీరామా థియేటర్ దాకా అన్ని చోట్లా ఒకే దృశ్యం.

నిన్న సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పోకిరి స్పెషల్ షోల ప్రభంజనం అర్ధరాత్రి దాటాక కూడా ఓ రేంజ్ లో సాగింది. ఏదో కొత్త సినిమా విడుదల కోసం బారులు తీరినట్టు జనం ఎగబడి మరీ టికెట్ల కోసం కొట్టుకోవడం మాములు రచ్చ కాదు. హైదరాబాద్ సుదర్శన్ తో మొదలుపెడితే కర్నూలు శ్రీరామా థియేటర్ దాకా అన్ని చోట్లా ఒకే దృశ్యం. విపరీతమైన సందడితో అభిమానులు చేసే అల్లరి, 16 ఏళ్ళ తర్వాత మాస్ క్లాసిక్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న మూవీ లవర్స్ ఆత్రం వెరసి రీ రిలీజ్ లో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనేలా ఉంది. వసూళ్ల లెక్కలు బయటికి చెబుతారో లేదో కానీ ఫిగర్స్ మాత్రం కోట్లలోనే ఉండబోతున్నాయి.

జనం థియేటర్లకు రావడం లేదు మొర్రో అని నిర్మాతలు పదే పదే చర్చలు పెట్టుకుంటున్న తరుణంలో ఇంత పాత సినిమాకు ఎగబడిన తీరు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తోంది. బిజినెస్ మాయలో పడి కంటెంట్ ని స్క్రిప్ట్ ని గాలికొదిలేసి కేవలం హక్కుల కోసమే పాకులాడుతున్న వాళ్లకు మాస్ లెసన్ నేర్పించింది. మాస్ యుఫొరియాని సరిగ్గా ప్రెజెంట్ చేస్తే పిల్లలు యువతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఏ స్థాయిలో అండగా నిలబడతారో రుచి చూపించింది. బాలీవుడ్ ని తినేస్తున్న కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు తెలుగు సినిమాకు పాకకుండా జాగ్రత్త పడకపోతే సింగల్ స్క్రీన్లు కనుమరుగయ్యే ప్రమాదాన్ని పబ్లిక్ క్రౌడ్ రూపంలో చాటి చెప్పింది.

సో మన రచయితలు దర్శకులు మిస్ అవుతున్నదేంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. గత రెండు మూడు నెలలుగా ప్రేక్షకులు హాళ్లకు రాకపోవడానికి సరైన కారణాలు అర్జెంట్ గా గుర్తించాలి. బింబిసార, సీతారామంలు సక్సెస్ అయినప్పటికీ అక్కడితో ఈ ప్రవాహం ఆగకూడదు. కేవలం విజువల్ గ్రాండియర్లనే కాదు గూస్ బంప్స్ ఇచ్చే మాస్ కంటెంట్ ని మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేస్తే రికార్డుల ఊచకోత ఖాయమని అర్థమైపోయింది. దెబ్బకు ఇదే తరహాలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సాను వేసేందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. అంతకన్నా ముందు ఆగస్ట్ 22న చిరంజీవి బ్లాక్ బస్టర్ ఏదైనా రీ రిలీజ్ ఉండొచ్చు

Show comments