iDreamPost
android-app
ios-app

Pushpa 2: మహేష్ బాబు రికార్డుని మడత పెట్టేసిన అల్లు అర్జున్!

  • Published Nov 18, 2024 | 3:31 PM Updated Updated Nov 18, 2024 | 3:31 PM

Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది. భారీ వ్యూస్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది. భారీ వ్యూస్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

  • Published Nov 18, 2024 | 3:31 PMUpdated Nov 18, 2024 | 3:31 PM
Pushpa 2: మహేష్ బాబు రికార్డుని మడత పెట్టేసిన అల్లు అర్జున్!

ఎట్టకేలకు పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదల అయ్యింది. విడుదల అవ్వడంతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డులు బద్ధలు కొడుతుంది. కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయాన్ని అల్లాడించే సమయంగా మార్చారు బన్నీ ఫ్యాన్స్. పుష్ప 2 ట్రైలర్ ని కనీవినీ ఎరుగని రీతిలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్స్ కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ పై దండయాత్ర చేస్తుంది. ఇప్పటికీ ‘పుష్ప 2’ ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. వ్యూస్ పరంగా ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

గతంలో తెలుగులో వచ్చిన ట్రైలర్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ హిట్ ‘గుంటూరు కారం’ ట్రైలర్‌ 24 గంటల్లో ఎక్కుమంది చూసిన ట్రైలర్ గా నిలిచింది. అప్పట్లో ఈ ట్రైలర్ సెన్సేషన్ అయ్యింది. సోషల్ మీడియాని గిర్రున ఊపేసింది. ఈ ట్రైలర్‌కు 24 గంటల్లో ఏకంగా 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రైలర్ తో పండుగ వాతావరణం సృష్టించారు. ఇక ఆ తరువాత వచ్చిన ఏ సినిమా ట్రైలర్ కూడా సూపర్ స్టార్ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ ఆ రికార్డుని పుష్ప 2 ట్రైలర్ మాత్రం బ్రేక్ చేసేసింది. అది కూడా కేవలం 15 గంటల్లోపే ఈ రికార్డ్ బద్దలు కొట్టేసింది.రిలీజైన 15 గంటల్లోనే ఏకంగా 40 మిలియన్ల పైగా వ్యూస్‌ రాబట్టింది. దీంతో టాలీవుడ్ లో 24 గంటలు గడవకముందే అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా ‘పుష్ప2’ న్యూ రికార్డ్ ని క్రియేట్ చేసింది.

ఇప్పటి దాకా 43 మిలియన్ల పైగా వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటలు పూర్తయ్యేసరికి 50 మిలియన్ల వ్యూస్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమారు 2:48 నిమిషాల నిడివితో ఉన్నఈ ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా సినిమా కావడం పైగా భారీ బజ్ క్రియేట్ కావడంతో పుష్ప2 ఈ రేంజిలో వ్యూస్ రాబడుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. ఈ మూవీ డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీ సంగతి. మరి మిలియన్ల వ్యూస్ తో ఇంటర్నెట్ ని రూల్ చేస్తున్న పుష్ప ది రూల్ ట్రైలర్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom