iDreamPost
iDreamPost
హెడ్డింగ్ వినగానే షాక్ తిన్నారా. అవును. ఇప్పుడీ టాక్ ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న 152వ సినిమా ఆచార్య(రిజిస్టర్డ్ టైటిల్)షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రెండు ఫైట్లు ఒక పాట పూర్తైపోయాయి. దీన్ని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ చేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చిరు యంగ్ ఏజ్ ఎపిసోడ్ కోసం ముందు రామ్ చరణ్ ను అనుకుని ఆ మేరకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ విడుదల కాకుండా చెర్రీ తారక్ ల సినిమాలు ఏవి రిలీజ్ కాకూడదన్న కండిషన్ పెట్టిన రాజమౌళి వల్ల ఆచార్య 2021 సమ్మర్ కు కు ముందు వచ్చే ఛాన్స్ లేదని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ బదులుగా ఆ పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చలు సీరియస్ గా జరుగుతున్నాయట. కొరటాల శివ అంటే మహేష్ కు ప్రత్యేకమైన గౌరవం.
ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు తనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడన్న ఇంప్రెషన్ ఇప్పటికీ తగ్గలేదు. అందుకే శివ అడిగితే మహేష్ నో చెప్పే ఛాన్స్ తక్కువే. అందులోనూ చిరంజీవి అంటే ప్రిన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. మొన్నో ఇంటర్వ్యూలో ఏదైనా ట్రిప్ కు ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు అంటే తారక్ చరణ్ లతో పాటు చిరు పేరు కూడా చెప్పాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి ఏరికోరి మరీ పిలుచుకుని వచ్చాడు. సో ఇప్పుడీ టాక్ నిజమైతే కనక మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ కనిపిస్తాడన్న మాట. కాకపోతే ఇద్దరి మధ్య కాంబినేషన్లు సీన్లు ఉండవు. ఇదెంతవరకు నిజమో తెలియాలంటే యూనిట్ నుంచి అధికారిక సమాచారం వచ్చే దాకా ఆగాల్సిందే.