iDreamPost
android-app
ios-app

Sarkaru Vaari Paata : మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే

  • Published Jan 11, 2022 | 8:35 AM Updated Updated Jan 11, 2022 | 8:35 AM
  • Published Jan 11, 2022 | 8:35 AMUpdated Jan 11, 2022 | 8:35 AM
Sarkaru Vaari Paata : మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే

సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1 విడుదలను ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతి నుంచి మార్చుకున్నామని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి అంతా బాగున్నా కూడా ఆ డేట్ ని ఖచ్చితంగా మీట్ అయ్యేవాళ్ళు కాదు. కారణం షూటింగ్ లో జరిగిన జాప్యం. ఇప్పుడు వైజాగ్ లో హీరో లేని సీన్స్ ని దర్శకుడు పరశురామ్ చిత్రీకరిస్తున్నాడు. ప్రిన్స్ ఎప్పటి నుంచి జాయిన్ అయ్యేది ఇంకా చెప్పలేదు. ఈ షెడ్యూల్ అయ్యాక తర్వాత జరగబోయే భాగానికి సంబందించిన ప్లానింగ్ రెడీ అవుతుంది. అది కూడా మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే.

ఇక్కడే కొన్ని సమస్యలు ఉన్నాయి. మహేష్ కరోనా బారిన పడ్డాడు. స్వంత అన్నయ్య రమేష్ బాబు చివరి చూపు దక్కనంత విషాదం ఇంకెవరికీ రాకూడదు. ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుందో మన ఊహకందదు. నాన్న కృష్ణ కంటే ఎక్కువగా రమేష్ తోనే తనకు బాండింగ్ అని మహేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు. అలాంటిది ఆ గాయం నుంచి త్వరగా బయటికి వస్తారని ఆశించలేం. కొంత టైం తీసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే బయట పరిస్థితి బాలేదు. కేసులు పెరుగుతున్నాయి. జనం ఎప్పటిలాగే తిరుగుతున్నారు కానీ ప్రభుత్వాల వైపు నుంచి మెల్లగా ఆంక్షలు పెరుగుతున్నాయి. సో ఏదీ తేలిగ్గా తీసుకోవడానికి లేదు

ఇప్పుడు చేతిలో ఉన్న రెండున్నర నెలల గడువులో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, ప్రమోషన్లు ఇన్నేసి పూర్తి చేయడం అంత సులభం కాదు. అందుకే ఏప్రిల్ 1 సర్కారు వారి పాట రాకపోవచ్చనే కామెంట్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఆ డేట్ ని ఆచార్య లేదా ఆర్ఆర్ఆర్ లో ఒకటి తీసుకోవచ్చు. లేదూ అంటే రాధే శ్యామ్, వలిమైలు కూడా కాచుకుని ఉన్నాయి. ఇప్పటికైతే ఈ క్యాలికులేషన్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో అంతు చిక్కడం లేదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న టీజర్ లేదా లిరికల్ వీడియోని రిలీజ్ ని కూడా పోస్ట్ పోన్ చేశారట

Also Read : Krithi Shetty : చాలా తెలివిగా కృతి కెరీర్ ప్లానింగ్

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş