iDreamPost
iDreamPost
ఈ నెల 9న రీ రిలీజ్ చేయబోతున్న పోకిరి కోసం ఫ్యాన్స్ మాములు హంగామా చేయడం లేదు. ఇప్పటిదాకా అరవై థియేటర్లు కన్ఫర్మ్ అయితే మరో రెండు మూడు రోజుల్లో దీనికి రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత దశాబ్దానికి పైగా ఏ పాత సినిమాకు రానంత రెస్పాన్స్ పోకిరికి వచ్చేలా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. దీనికి వచ్చే రెవిన్యూ మొత్తం మహేష్ బాబు చారిటీ తరఫున చేయబోయే పనులకు ఉపయోగించబోతున్నట్టు తెలిసింది. అది ఎంతనేది బయటికి రాలేదు కానీ షో వేయడానికి అయ్యే ఖర్చు, అద్దెలు, కరెంటు బిల్లుకు పోను మిగిలిన షేర్ ని ఈ రూపంలో డొనేట్ చేయబోతున్నట్టు సమాచారం. చిన్న మొత్తమైతే ఉండదు.
ఇప్పటికే చాలా చోట్ల ఒక్కడు షోలు పడ్డాయి. ఆగస్ట్ 9 దాకా ఇవి కొనసాగనున్నాయి.మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా వీటి నుంచి స్ఫూర్తి చెందుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒరిజినల్ నెగటివ్ దొరకనందు వల్ల డిపిఎక్స్ ఫైల్ సాధ్యం కాదని అన్నప్పటికీ ఫైనల్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో ఉన్నట్టుగా తేలింది. సో రీ మాస్టరింగ్ చేసి డాల్బీ మిక్స్ చేస్తే రిలీజ్ కు రెడీ అయిపోతుంది. ప్రభాస్ అభిమానులు వర్షం, ఛత్రపతి కోసం, రవితేజ బ్యాచ్ విక్రమార్కుడు, కిక్ కోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమ డిమాండ్లను ఉంచుతున్నారు. టికెట్ రేట్లు ఎక్కువైనా భరించేందుకు రెడీ అవుతున్నారు.
ఇలా పాత సినిమాలను తిరిగి డిజిటల్ థియేటర్ ఫార్మాట్ లోకి మార్చాలంటే సుమారు మూడు లక్షలకు పైగా ఖర్చవుతుంది. సాధారణంగా ఈ రిస్క్ ని నిర్మాత తీసుకోడు. ఫ్యాన్సే తలా కొంత వేసుకోవాలి లేదా సదరు హీరో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అందాలి. ఈ రెండు కాకుండా చేయడం అసాధ్యం. ఒకప్పటి లాగా ప్రింట్ల కాలం కాదు కాబట్టి డిజిటల్ లోకి మార్చడం ఖరీదైన వ్యవహారం. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అవసరం ఉండదు. గతంలో చెన్నకేశవరెడ్డి, ఆదిలకు చేసి క్రాస్ రోడ్స్ లో షోలు వేశారు. ఇదే తరహాలో చిరు బాలయ్య నాగ్ వెంకీల ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని రిలీజ్ చేయాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. కానీ ఇవి మాత్రం అంత సులభం కాదు