Idream media
Idream media
రాజకీయంగా కనుమరుగవ్వడం ఖాయం-టిడిపి ఎమ్మెల్యే ఘాటు విమర్శ
గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదని ఒక ఎమ్మెల్యే ఘాటు విమర్శ చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరు..? ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మరి చంద్రబాబుపై ఇంతటి ఘాటు విమర్శ చేసింది మరెవంటాబ్బ…! సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి విమర్శ చేశాడు..అవును నిజమే టిడిపి అధినేత పై ఆపార్టి ఎమ్మెల్యే విమర్శల వర్షం కురిపించారు.
ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబు నాయుడుకి ఇంకా బుద్ధి రాలేదని గుంటూరు పశ్చిమ టిడిపి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నారని, ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. గుంటూరులోని స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఎన్నో బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంపై సిఎం జగన్‌పై చంద్రబాబు అనవసర ఆరోపణలు మానుకోవాలని లేకుంటే రాజకీయంగా కనుమరుగవటం ఖాయమని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేర్కొన్నారు. ఇలా సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు విమర్శించే స్థాయికి చంద్రబాబు దిగజారుతారని తెలుగు తమ్ముళ్లు, ప్రజలెవ్వరూ ఉహించి ఉండరేమో…కాని చంద్రబాబు వైఖరి వల్ల ప్రజలు, తెలుగు తమ్ముళ్లు ఊహించనది జరుగుతుంది.