iDreamPost
android-app
ios-app

మాచర్లకు ఊహించని వివాదం

  • Published Jul 27, 2022 | 12:37 PM Updated Updated Jul 27, 2022 | 12:37 PM
మాచర్లకు ఊహించని వివాదం

వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. థియేట్రికల్ గా గత ఏడాది రెండు షాకులు తగిలాయి. చెక్, రంగ్ దేల కోసం ఎంత కష్టపడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ముచ్చటపడి చేసిన హిందీ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ మాస్ట్రో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో అది హిట్టో ఫట్టో కూడా అర్థం కాలేదు. అందుకే మాచర్లతో పెద్ద బ్రేక్ అందుకోవాలనే నమ్మకంతో ఉన్నాడు. అదే రోజు నిఖిల్ కార్తికేయ 2 వస్తున్నా, 11న అమీర్ ఖాన్ నాగ చైతన్యల లాల్ సింగ్ చడ్డా కవ్విస్తున్నా వెనుకడుగు వేయడం లేదు. ఈ మూడింటిలో మాస్ పరంగా కమర్షియల్ అంశాలున్నది మాచర్లలోనే.

ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డికు ఊహించని వివాదం సోషల్ మీడియా రూపంలో వచ్చి పడింది. 2019 ఏపి ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు మీద సెటైర్లు వేశాడని, జగన్ కు మద్దతు ఇచ్చారని చూపించే స్క్రీన్ షాట్లు ఫేస్ బుక్, ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడో జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు కొందరు కోరి మరీ బయటికి తీయడం మాచర్ల నియోజకవర్గానికి తప్పుదారి పట్టించే పబ్లిసిటీ ప్రమాదం లేకపోలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం తన ట్వీట్లను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అవసరం లేని పొలిటికల్ టర్న్ తీసుకోవడం ప్రమోషన్ పరంగా ఈ సినిమాకు సేఫ్ కాదు.

ఉద్దేశం ఏదైనా ఇది వివిధ అర్థాల్లో చర్చకు దారి తీసింది. ఇంకో మూడు వారాలే ఉన్న నేపథ్యంలో నితిన్ బృందం ప్రమోషన్ల కోసం ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చి పడింది. ఇది త్వరగానే సమిసిపోతుంది కానీ సామాజికవర్గం సమీకరణాల ఆధారంగా దీన్ని యాంటీ ఫ్యాన్స్ వాడుకుంటేనే ఇబ్బంది. రామారావు ఆన్ డ్యూటీ తర్వాత మాస్ పరంగా ఎక్కువ అంచనాలు ఉన్నది ఈ సినిమాకే. ఇందులో నితిన్ ఐఎఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మాచర్లకు వచ్చి అక్కడి రాజకీయ వాతావరణాన్ని సమూలంగా మార్చేసే కలెక్టర్ గా కొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే అంజలి చేసిన ఐటెం సాంగ్ యుట్యూబ్ లో చార్ట్ బస్టర్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్