iDreamPost
iDreamPost
శింబు హీరోగా గత నెల తమిళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన మానాడు ఇవాళ్టి నుంచి సోనీ లివ్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది. నిజానికి దీని తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఆ టైంలోనే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఏవో పరిణామాల వల్ల అది జరగలేదు. కట్ చేస్తే రోజులు గడిచిపోయాయి. ఇప్పుడీ సినిమాని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. మెగా కాంపౌండ్ లో ఎవరైనా హీరోతో పునఃనిర్మించే ఆలోచనతోనే అనువాదాన్ని పక్కన పెట్టేశారని న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజమనేది పక్కనపెడితే అసలు ఈ మానాడులో ఏముందో రిపోర్ట్ లో చూద్దాం
ఫ్లైట్ లో స్నేహితుడి ప్రేమపెళ్లి కోసం గోవాకు వెళ్తున్న అబ్దుల్ ఖాలిక్(శింబు)కు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కలగా వస్తుంటాయి. అందులో ముఖ్యమంత్రి హత్య ఉంటుంది. దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో టైం లూప్ లో మళ్ళీ మళ్ళీ ఆ కలను చూస్తున్న ఖాలిక్ ఆ ప్రయత్నాల్లో విజయవంతమవుతూ ఉంటాడు. ఈ కుట్ర వెనుక డిఎస్పి ధనుష్ కోటి(ఎస్ జె సూర్య) ఉన్నాడని తెలుసుకుని అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. ఊహించని విధంగా ధనుష్ కు కూడా ఖాలిక్ మాదిరే అదే సంఘటన తాలూకు కలలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెరోవైపు ఇద్దరూ సిఎంని కాపాడేందుకు చంపేందుకు టైం లూప్ లోకి వెళ్లి వస్తూ ఉంటారు.
మరి చివరికి ముఖ్యమంత్రి ఏమయ్యాడు, ఖాలిక్, ధనుష్ లకు మాత్రమే ఆ కల ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాలి. మానాడు అంటే సమావేశం. చాలా వినూత్నమైన పాయింట్ తో ఈ కథను రాసుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన టేకింగ్ తో మెప్పించారు. టైం లూప్ కాన్సెప్ట్ కావడంతో సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతూ రెగ్యులర్ ఆడియన్స్ ని కొంత ఇబ్బంది పెడతాయి కానీ సీరియస్ మూవీ లవర్స్ కు మంచి థ్రిల్ ఇస్తుంది. కాకపోతే ఇలాంటి రిపిటీటివ్ స్క్రీన్ ప్లేని మన తెలుగు ప్రేక్షకులు ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ముందు రీమేక్ హీరో ఎవరో తేలితే అప్పుడు చెప్పొచ్చు
Also Read : Sankranthi Telugu Releases : తెలుగు సంక్రాంతి రేసులో కొత్త ట్విస్టు