iDreamPost
android-app
ios-app

‘మా’ బిల్డింగ్ త్వరలో.. మంచు విష్ణు కీలక కామెంట్స్..

  • Published May 15, 2022 | 4:54 PM Updated Updated May 15, 2022 | 4:54 PM
  • Published May 15, 2022 | 4:54 PMUpdated May 15, 2022 | 4:54 PM
‘మా’ బిల్డింగ్ త్వరలో.. మంచు విష్ణు కీలక కామెంట్స్..

టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు ఎంత రచ్చ సృష్టించాయో మన అందరం చూశాం. 900 మంది ఉన్న చిన్న అసోసియేషన్ కోసం టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరి పరస్పర వ్యక్తిగత దూషణ దాకా వెళ్లారు. మొత్తానికి ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచారు. ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’కి సొంత బిల్డింగ్ కడతాను అనే ముఖ్యమైన హామీతో వెళ్లారు. తాజాగా దీనిపై మాట్లాడారు మంచు విష్ణు.

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆదివారం ఉదయం AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ మెంబర్లంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ‘మా’ బిల్డింగ్ తో పాటు మరికొన్ని విషయాలు కూడా మాట్లాడారు.

ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ”ఆరునెలల్లో ‘మా’ బిల్డింగ్ భూమి పూజ చేసి పనులు మొదలు పెడతాము. నాకు ‘మా‌’ సభ్యుల వెల్పేర్, హెల్త్ ముఖ్యం. అందుకే ఇవాళ వారి ఆరోగ్యం కోసం ఈ హెల్త్ చెకప్ పెట్టాను. నన్ను చాలా మంది విమర్శించారు. అవన్నీ నేను పట్టించుకోను. ఇకపై ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము” అని అన్నారు. మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో మరోసారి చర్చకి దారి తీశాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş