iDreamPost
android-app
ios-app

భీష్మకు భలే లక్కీ ఛాన్స్

  • Published Feb 10, 2020 | 5:10 AM Updated Updated Feb 10, 2020 | 5:10 AM
భీష్మకు భలే లక్కీ ఛాన్స్

గత ఏడాది అసలే సినిమా లేకుండా అభిమానులను నిరాశపరిచిన నితిన్ వచ్చే వారం 21న భీష్మగా రానున్నాడు. ఇప్పటికే టీజర్ అంచనాలు రేకెత్తించగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఆడియో సింగిల్స్ బాగానే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఛలో ఫేమ్ మహతి స్వరసాగర్ మరో సారి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. మణిశర్మ వారసుడైనప్పటికీ స్లోగా వెళ్తున్న మహతికి ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. దర్శకుడు వెంకీ కుడుముల దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.

మొన్న శుక్రవారం రిలీజైన జాను ఇప్పటికే స్లో అయిపోయింది. ఫస్ట్ వీకెండ్ కూడా ఏమంత ఘనమైన వసూళ్లు రాలేదు. ఇప్పుడు వారాంతం ముగిసింది కాబట్టి విపరీతమైన డ్రాప్ ఉంటుందన్న ట్రేడ్ భయం నిజమవుతుందో లేదో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ 14న వచ్చేస్తాడు. దానికి మంచి టాక్ వచ్చినా భీష్మకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసింది. ఫ్యామిలీని మాస్ ని రీచ్ అవ్వడం గురించి డౌట్ ఉంది.

కాని నితిన్ కో అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే భీష్మలో మాస్ కంటెంట్ ఉంది. పైకి ప్రేమ కథలా కనిపించినా హీరోయిన్ రష్మిక మందన్న గ్లామర్ షోతో పాటు పబ్లిసిటీలో ఎక్కువగా రివీల్ కానీ యాక్షన్ ఎలిమెంట్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నట్టుంది. సంక్రాంతి తర్వాత ఈ సెట్ ఆడియన్స్ ని మెప్పించే సినిమా ఏదీ రాలేదు. అందుకే భీష్మ కనక ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే నితిన్ కు హిట్ దొరుకుతుంది. రష్మిక ఎలాగూ కొత్త ఏడాదికి సూపర్ హిట్టుతో బోణీ చేసింది. సో ఇప్పుడిది కూడా వర్కవుట్ అయితే తనకు అంతకన్నా కావాల్సింది ఏముంది. చాలా కాలం తర్వాత శాండల్ వుడ్ స్టార్ యాక్టర్ అనంత్ నాగ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా భీష్మనే కావడం గమనార్హం.

marsbahis giriş