iDreamPost
android-app
ios-app

లూసీఫర్ చుట్టూ ఎన్నో చిక్కులు

  • Published Jul 18, 2020 | 7:02 AM Updated Updated Jul 18, 2020 | 7:02 AM
లూసీఫర్ చుట్టూ ఎన్నో చిక్కులు

మెగాస్టార్ చిరంజీవి ఏరికోరి ముచ్చటపడి మరీ చేయాలనుకున్న లూసిఫర్ రీమేక్ ఇంకా షూటింగ్ కు వెళ్లకుండానే వార్తల్లో నిలుస్తోంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ మెగా మూవీకు క్యాస్టింగ్ అతి పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ఒరిజినల్ వెర్షన్ యధాతధంగా తీయాలా లేక చిరు ఇమేజ్ కు తగ్గట్టు కీలక మార్పులు చేయాలా అనే అయోమయం ఇంకా వీడనే లేదట. చిరంజీవికి బాగా సన్నిహితుడైన ఓ స్టార్ డైరెక్టర్ మలయాళం కథలో ఫీల్ పోకుండా యాజిటీజ్ తీయమని సలహా ఇస్తే హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమాను అభిమానులు చూడలేరని మరో సన్నిహితుడు చెప్పారట. ఈ గందరగోళమే ఒకపక్క కొనసాగుతూ ఉండగా మరోవైపు నెక్స్ట్ లైన్లో ఉన్న బాబీ ఓ కథని పూర్తి చేసి చిరంజీవికి వినిపించాడట.

ప్రాధమికంగా లైన్ చాలా నచ్చిందని ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ కనక బాగా వస్తే లూసిఫర్ రీమేక్ కన్నా ముందు ఇదే సెట్స్ పైకి తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. అదే జరిగితే సుజిత్ కు పెద్ద షాకే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆచార్య పూర్తి చేయడానికే ఇంకో నాలుగైదు నెలలు కావాల్సి ఉంది. అది కూడా దసరాకు పూర్తిగా కరోనా కేసులు తగ్గిపోతేనే. లేదా మళ్ళీ వాయిదా తప్పదు. అదే జరిగితే ఆచార్య కాస్త సమ్మర్ కు పోతుంది. ఆలోగా బాబీ కనక ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పిస్తే దాని షూటింగ్ కి ఇంకో ఆరు నెలలు కావాలి. అంటే 2021 సంపూర్ణంగా గడిచిపోతుంది. లూసిఫర్ రీమేక్ 2022లో మొదలుపెట్టాలి. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.

ఇప్పటికే ఈ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ రూపంలో ఆన్ లైన్లో, ప్రైమ్ లో ఇలా రకరకాల మాధ్యమాల్లో ఎందరో అభిమానులు ప్రేక్షకులు చూసేశారు. కథ ఎలా ఉంటుందన్న విషయంలో వాళ్లకు ఎగ్జైట్ మెంట్ లేదు. కాబట్టి మార్పులు చాలా కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు సెకండ్ హాఫ్ లో కీలకంగా నిలిచే మరో యూత్ హీరో సెలక్షన్ కూడా ఛాలెంజ్ గా మారుతోంది. ఇవన్నీ చూస్తుంటే అసలు లూసిఫర్ కు ఎప్పుడు రెక్కలు వస్తాయోనని అనుమానం రావడం సహజం. గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు విషయంలోనూ ఇలాగే ఆలస్యం చేయడం దాని ఫలితం మీద ప్రభావం చూపించింది. మరి లూసిఫర్ కు అలా జరక్కుండా ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారో మరి. ఇంకోవైపు సుజిత్ స్థానంలో వివి వినాయక్ రావోచ్చనే పుకారు కూడా జోరుగా షికారు చేస్తోంది.