iDreamPost
android-app
ios-app

Recharge Scam – రీఛార్జ్ పేరుతో 200 కోట్ల స్కామ్

Recharge Scam – రీఛార్జ్ పేరుతో 200 కోట్ల స్కామ్

ఏదోక రూపంలో ప్రజలను టార్గెట్ చేస్తున్న నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఎక్కడో ఒక చోట ఈ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు ఆశపడటం, వాటిని ఎక్కువ ఊహించుకుని అడిగినవి ఇవ్వడం అనేది చాలా మంది కొంప ముంచుతుంది. రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతులు కాదన్నట్టే పరిస్థితి ఉంది. మంత్రుల పేర్లతో కూడా కొందరు సైబర్ నేరగాళ్ళు తమ ప్రతాపం చూపిస్తున్నారు.

ఇక ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు లాంటి నగరాల్లో సైబర్ నేరగాళ్ళు ప్రజలను మభ్యపెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. విదేశాల్లో ఉండి కొందరు తమ ప్రతాపం చూపిస్తే… ఇండియాలో ఉండే, ఆఫీసులు ఓపెన్ చేసి మోసాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. రూ.200 కోట్లకు టోకరా పెట్టేసింది బ్యాచ్.

లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.500 నుంచి రూ.2 వేలకు హెల్త్ పరికరాలను ఆన్‌లైన్‌లో ఒక సంస్థ పోస్ట్ చేసింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ చేయించుకోవాలని చెప్తూ మోసానికి పాల్పడ్డారు. రీచార్జ్ చేసుకున్నందుకు రూ.100 నుంచి రూ.2 వేల వరకు గిఫ్ట్ వస్తుందని నమ్మించారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు కలిసికట్టుగా ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

బాధితుల్లో న్యాయవాదులు, పోలీసులు, వైద్యులు, సాప్ట్ వేర్ ఇంజినీర్లు ఉండటం నివ్వేరపరిచే అంశం. 20 లక్షల మంది బాధితులు ఉన్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి ఈ సంస్థ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి క్లారిటీ రాలేదు.