iDreamPost
iDreamPost
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అతనికి క్రేజ్ చాలా ఎక్కువే. ఆటలోను, ఫాలోవర్స్ లోను అతనికి అందరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులో కూడా కుర్రాళ్ళతో పోటీ పడి ఫుట్‌బాల్ ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం పోర్చుగల్ ఫుట్‌బాల్ టీంకి కెప్టెన్ గా ఉన్నాడు రోనాల్డో. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో భావిస్తున్నాడు. ఇదే అతని చివరి ఫిఫా వరల్డ్ కప్ కూడా అవ్వొచ్చు.
అయితే రోనాల్డో కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేదు, కానీ వ్యక్తిగత జీవితంలో ఒక అత్యాచారం కేసు ఎప్పట్నుంచో రొనాల్డోని ఇబ్బంది పెడుతుంది. తాజాగా 13 ఏళ్ళ తర్వాత రొనాల్డోపై ఉన్న అత్యాచారం కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై కొన్నేళ్లుగా విచారణ సాగింది.
సుదీర్ఘ విచారణ అనంతరం లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని, 42 పేజీల తీర్పుని ఇస్తూ రొనాల్డోపై ఉన్న అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది.