Idream media
Idream media
జాబు కావాలంటే బాబు రావాలి.. ఈ స్లోగన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు. ఎందుకంటే అంతలా ఊదరగొట్టారు మరి. 2014 ఎన్నికలకు ముందు ఏ గోడ మీద చూసినా అదే. ఏ బోర్డుపై చూసినా అదే. నిరుద్యోగులకు ఎంతో ఆశ కల్పించారు. బాబు అధికారంలోకి రావడానికి ఓ రకంగా అది బాగానే పని చేసిందని చెప్పొచ్చు. బాబు వచ్చారు కానీ.. జాబులు రాలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో యువత బాబుకు గట్టి ఝలక్ ఇచ్చారు. వైసీపీకి పట్టం కట్టారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు సీఎం జగన్. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన రికార్డు సృష్టించారు. అంతేకాదు, జాబ్ కేలండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ నిరంతరం సాగేలా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే, ఉద్యోగాల భర్తీకి పోరాడతానని ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొత్త పల్లవి అందుకోవడం ఆశ్చర్యంగా మారింది.
చంద్రబాబు హయాంలో ఐదేళ్ల పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు జాబు కావాలంటే బాబు పోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అనుకున్నట్లుగానే తర్వాతి ఎన్నికల్లో ఆయనను సాగనంపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి అయ్యా.. అంటే ఒకటి నారాయణకు, రెండు లోకేశ్‌కు అన్న ప్రచారం కూడా జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. ఏపీలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మే
రకు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4 నెలలకే ఉద్యోగాల భర్తీకి జగన్ చర్యలు చేపట్టారు.
ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అంతేకాకుండా, వలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములను చేశారు. మొత్తమ్మీద రెండేళ్ల కాలంలోనే ఏపీలో 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ సర్కార్ ది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న రాష్ట్రం ఏపీనే. అంతేకాకుండా, 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. . అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. లంచం ఇస్తేనే ఉద్యోగం అన్న పరిస్థితిని మార్చేశారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అంతేకాకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మినిమమ్ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచారు. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.
ఇవేమీ పట్టని లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు జగన్‌రెడ్డి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే భర్తీ చేసే వరకూ తన పోరాటం ఆగదంటూ స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తున్నారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి రాకముందు చేసిన ప్రచారం, వచ్చాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఆయనకు తెలియందేం కాదు. అలాంటిది లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ పై ఉద్యోగాల భర్తీ కోసం పోరాడతామని లోకేశ్ ప్రకటించడం గురువింద గింజ చందంగా మారింది.