Idream media
Idream media
నారాలోకేష్.. తన తండ్రి చంద్రబాబు హాయంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా రాణించడంలో కన్నా.. తన మాటల ద్వారా నిత్యం ప్రజల నోళ్లలో నానుతుంటారు. పేర్లను సరిగా పలకలేకపోవడంతో.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటారు. ఇప్పటికీ పేర్లు సరిగా పలకలేకపోవడం లోకేష్‌కు ఉన్నపెద్ద మైనస్. అందుకే ఆయన ఎక్కువగా మీడియా ముందుకు రారు. ట్వీట్టర్‌లోనే ఎక్కువగా స్పందిస్తున్నారు.
ట్వీట్టర్ వేదికగా లోకేష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పేర్లు పకలడంపై లోకేష్ వైఎస్సార్‌సీపీ ఎంపీని ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు. నిన్న గురువారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డమ్మీ కంపెనీ గురించి మాట్లాడారు. విశాఖలో ఫ్రాక్లింన్ టెంపుల్టన్ అనే డమ్మీ కంపెనీని పెట్టి వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములు ఆ కంపెనీకి కేటాయించారని ఆరోపించారు. కేవలం 30 కోట్ల పెట్టుబడికి వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించడం పెద్ద స్కాం అని అన్నారు.
సదరు కంపెనీ పేరును ఎంపీ మిధున్ రెడ్డి తన ప్రసంగంలో రెండుసార్లు పలికారు. ఒక సారి ‘ఫ్రాక్లిన్ టెంపుల్ టౌన్’ అని మరో సారి ‘ఫ్రాక్లింన్ టెంపుల్టన్’ అని మాట్లాడారు. సదరు వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన లోకేష్ ఎంపీ మిథున్ రెడ్డిని హేళన చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబు గారి బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంట్‌లో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిధా చేసింది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
లోకేష్ ట్వీట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.పేర్లు పకలడం గురించి లోకేష్ మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇది ఎనిమిదో వింతని సెటైర్లు వేస్తున్నారు. గతంలో లోకేష్ పలికిన పేర్లును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుంతుర్రు (గుంటూరు), మందలగిరి (మంగళగిరి), ఆ ఊ అంటే దెంగొచ్చేది (ఆ ఊ అంటే డెంగ్యూ వచ్చేది) లాంటి ఆణిముత్యాలు లోకేష్ నోటి నుంచి జాలువారాయని గుర్తు చేస్తున్నారు. పేర్లు సరిగా పలకలేకపోవడంలో ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్‌ను మించిన వారు మరొకరు లేరు. ఇది ఎన్నో సార్లు రుజువైంది. అలాంటి లోకేష్.. పేరు సరిగా పలకలేదని ఎంపీ మిథున్ రెడ్డిని ఎగతాళి చేయడం కామెడీకి పరాకాష్ట. ఈ విషయంపై ట్వీట్ చేసిన లోకేష్.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మళ్లీ టార్గెట్ అయ్యారని చెప్పవచ్చు.