Idream media
Idream media
సంక్రాంతి పండగ ముగిసిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పండగ మొదలవబోతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను అధికారులు హైకోర్టుకు ఈ రోజు సమర్పించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఈ షెడ్యూల్‌లో అన్ని పరిషత్, పంచాయతీ ఎన్నికలను మార్చి 3 లోపు పూర్తి చేసేలా పొందుపరిచారు. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్యన ఈ ఎన్నికలు పూర్తి చేస్తామని అపిడవిట్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్యన పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, షెడ్యూల్ కూడా రూపొందించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీ రాజ్, ఆర్థిఖ శాఖ అధికారులతో సమావేశం కానుంది. ఆ తర్వాత 13వ తేదీన రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనుంది.