P Venkatesh
సంక్రాంతి పండగక్కి సొంతూళ్లకు వెళ్లే వారితో రహదారులన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సంక్రాంతి పండగక్కి సొంతూళ్లకు వెళ్లే వారితో రహదారులన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
P Venkatesh
సంక్రాంతి పండగ సందడి మొదలైంది. సంక్రాంతి వేడకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పండక్కి ఊరెళ్లే వారితో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇక సొంత వాహనాలు ఉన్నవారు కుంటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలను జరుపుకునేందుకు వారి గ్రామాలకు బయలుదేరుతున్నారు. నిన్న మొన్నటికంటే నేడు వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్- విజయవాడ హైవేపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చిన వారు సంక్రాంతి పండగను జరుపుకునేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. దీంతో ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారి వైపు మళ్లించడంతో.. అటు హైదరాబాదు రోడ్డు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో 5 కిలోమీటర్ల మేర వివిధ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అటు, ఇటు వెళ్లకుండా వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ట్రాఫిక్ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు.
Festive Rush.
Hyderabad – Vijayawada Highway after Surypet today.@HyderabadMojo pic.twitter.com/smLfd8dzaa— lakshminarayana (@laxman_travel) January 13, 2024