iDreamPost
android-app
ios-app

బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ కు చుక్కెదురు

బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ కు చుక్కెదురు

లోక్‌జనశక్తి పార్టీలో ఇకపై అంతా ‘​చిరాగ్’ యుగమే. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆయన తండ్రి దివంగ‌త రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. కానీ, ప్ర‌స్తుతం పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు పార్టీలో చుక్కెదుర‌వుతోంది. గతేడాది తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణం తర్వాత బిహార్ లో ఎన్‌డీఏ నుంచి‌ పాశ్వాన్ బయటికొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పార్టీని తిర‌స్క‌రిస్తే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ చిరాగ్ ను తిర‌స్క‌రించారు.

ఎంపీల తిరుగుబావుటా

ఎల్‌జేపీ ఎంపీలు తిరుగుబావుటా వేయ‌డంతో బిహార్ రాజ‌కీయాలు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆ పార్టీకి ఆరుగురు ఎంపీలు ఉండగా, వారిలో ఐదుగురు స‌భ్యులు చిరాగ్ ను వ్య‌తిరేకిస్తున్నారు. లోక్ స‌భ‌లో ఎల్జేపీ నాయ‌కుడిగా చిరాగ్ ను తొల‌గించి ఆయ‌న స్థానంలో పశుపతి కుమార్ పరాస్‌ను నియ‌మించాల‌ని, లోక్‌సభలో తమను ఎల్‌జేపీ నుంచి వేరుగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. పశుపతి కుమార్ పరాస్ చిరాగ్ కు . ఎల్‌జేపీ ఎంపీలు ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కేసర్‌లు ఆయ‌న‌నే త‌మ నేత‌గా ఎన్నుకున్నారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి చిరాగ్ పాశ్వాన్‌తో ఆ పార్టీ ఎంపీలకు విబేధాలు ఏర్పడ్డాయి.

చిరాగ్ ఏమంటున్నారంటే…

ఎంపీల తిరుగుబాటు వెనుక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హస్తం ఉందని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. వీరంద‌రూ అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు తెలిపాయి. గత ఏడాది తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుంచి చిరాగ్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. పాశ్వాన్ చనిపోయిన నుంచే చిరాగ్, పరాస్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. పాశ్వాన్ చ‌నిపోయిన నాలుగో రోజున‌ పార్టీ నుంచి బహిష్కరిస్తానని పరాస్‌ను చిరాగ్ హెచ్చరించారు. ఇదిలా ఉండ‌గా, ఇప్పటికే రెబల్ ఎంపీలంతా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లెఫ్టినెంట్ లలన్ సింగ్‌తో కలిసి పనిచేస్తున్నారని ఎల్పేజీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పశుపతి కుమార్ పరాస్ హజీపూర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పరాస్‌కు కేంద్ర క్యాబినెట్ పదవి ఇప్పిస్తానని నితీశ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇది నితీశ్ ప‌న్నాగ‌మా..? ప్ర‌తీకార‌మా?

గ‌త ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ నుంచి‌ చిరాగ్ పాశ్వాన్ బయటకొచ్చారు. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా పోటీలో నిల‌బ‌డి.. నితీశ్‌ పార్టీని పరోక్షంగా దెబ్బకొట్టారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఎల్పేజీ సీట్లు సాధించ‌లేక‌పోయినా జేడీయూ సీట్ల‌ను త‌గ్గించ‌డంలో విజ‌యం సాధించామ‌ని చిరాగ్ మాట్లాడారు. దీంతో అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తోన్న నితీశ్ కుమార్.. ఎల్జేపీలో చీలిక తెచ్చి చిరాగ్‌పై ప్రతీకారం తీర్చుకున్న‌ట్లుగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. చిరాగ్ మరో బంధువు ప్రిన్స్ రాజ్ కూడా రెబల్స్‌తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. అతడికి ఇటీవలే ఎల్జేపీ బీహార్ అధ్యక్ష పదవిని ఇవ్వడం గమనార్హం.

Also Read : నగదు బదిలీ పథకం మాదేనంటున్న యనమల.. నాటి పాలన గుర్తులేదా..?