iDreamPost
android-app
ios-app

ఎమర్జెన్సీ వార్డులో పోలీసుల ఓవర్ యాక్షన్.. సినిమా స్టైల్‌ లో నిందితుడు అరెస్ట్‌.. ఏం జరిగిందంటే?

  • Published May 23, 2024 | 11:07 AM Updated Updated May 23, 2024 | 11:13 AM

తాజాగా ఓ ఆసుపత్రిలో మహిళ వైద్యరాలపై నర్సింగ్‌ అధికారి అసభ్యంగా వేధింపులకు గురిచేశాడు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఏకంగా నిందితుడుని అరెస్ట్‌ చేసేందుకు సినిమా స్టైల్‌ లో తమ వాహనం తో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా ఓ ఆసుపత్రిలో మహిళ వైద్యరాలపై నర్సింగ్‌ అధికారి అసభ్యంగా వేధింపులకు గురిచేశాడు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఏకంగా నిందితుడుని అరెస్ట్‌ చేసేందుకు సినిమా స్టైల్‌ లో తమ వాహనం తో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published May 23, 2024 | 11:07 AMUpdated May 23, 2024 | 11:13 AM
ఎమర్జెన్సీ వార్డులో పోలీసుల ఓవర్ యాక్షన్.. సినిమా స్టైల్‌ లో నిందితుడు అరెస్ట్‌.. ఏం జరిగిందంటే?

 దేశంలోని మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. అడుగడుగునా శారీరకంగా, మానసికంగా వారు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. ముఖ్యంగా వారు ఏ స్థాయిలో ఉ‍న్న, ఏ వృత్తి రిత్యాలో ఉన్న ఇలాంటి సమస్యలు ఎదుర్కొక తప్పడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ వైద్యురాలు కూడా ఇలాంటి వేధింపులకు బాధితురాలు అ‍య్యింది. కాగా, అదే ఆసుపత్రిలో ఉన్న ఓ నర్సింగ్‌ అధికారి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్‌ లో అతని అరెస్టు చేయడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఎయిమ్స్  రిషికేశ్‌లోని ప్రధాన ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ మహిళ వైద్యరాలు వేధింపులకు గురయ్యింది. అయితే ఆమె పై  ఆ వేధింపులకు పాల్పడిన వ్యక్తి అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్‌ అధికారి సతీష్ కుమార్ కావడం గమన్హారం. నిందితుడు సతీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి ఆవరణలో ఆ వైద్యరాలిని వేధించడమే కాకుండా.. ఆమెకు అసభ్యకరమైన SMS కూడా పంపాడు.  అయితే ఈ వేధింపుల పై ఫిర్యాదు అందుకున్న డెహ్రాడూన్ పోలీసులు పోలీసులు నిందుతుడిని అరెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, పోలీసులు అరెస్ట్‌ నుంచి తప్పించుకున్న నిందితుడు సతీష్‌ సమాచారం తెలుసుకున్న డెహ్రాడూన్ పోలీసులు పక్క ఫ్లాన్‌ తో ఆపరేషన్‌ నిర్వహించి అరెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే నిందుతుడిని పోలీసులు అచ్చం సినిమా స్టైల్‌ మాదిరిగా  ఆసుపత్రి ఆవరణలో అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకగాను.. ఏకంగా ఎయిమ్స్ ఆసుపత్రిలోని పోలీసులు ఏకంగా.. తమ వాహనంలో నాల్గవ అంతస్తు వర కు ఎమర్జెన్సీ వార్డ్‌కు చేరుకున్నారు. కాగా, పోలీసులు తమ వాహనంతో అత్యవసర వార్డులోకి ప్రవేశించడంతో ఆసుపత్రిలోని అంతా గందరగోళం నెలకొంది. అంతేకాకుండా.. ఆసుపత్రి  సిబ్బంది పోలీసు వాహనం వెళ్లేందుకు దారి క్లియర్ చేయడానికి రోగుల బెడ్లు, స్ట్రెచర్లను పక్కకకు తరలించాల్సి వచ్చింది. ఇక ఇంత హంగామా జరిగిన పోలీసులు ఆగకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందుతుడిని పట్టుకొని అరెస్టు చేశారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా స‍్పందిస్తున్నారు. అలాగే నిందుతుడిని పట్టుకనేందుకు ఇలా ఆసుపత్రికి జీపులో రావాలా చాలా ఓవర్‌ గా ఉందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనపై దృష్టి సారించింది. అంతేకాకుండా.. నిందితుడి అరెస్టు సమయంలో ఏర్పడిన అంతరాయంపై, ప్రజల నిరసనకు ప్రతిస్పందనగాను,  వేధింపులకు గురైన మహిళా వైద్యురాలిని కలవడానికి AIIMS ను సందర్శించారు. మరి, నిందుతుడిని అరెస్ట్‌ చేసేందుకు  పోలీసులు తమ వాహనం పై  ఆసుపత్రిలో ఎమర్జెన్సి వార్డులోకి వెళ్లిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.