iDreamPost
iDreamPost
విజయ్ దేవరకొండ , అనన్య పాండే నటించిన లిగర్ దేశం మొత్తం ఎదురుచూస్తున్న ‘పాన్ ఇండియా’ చిత్రాలలో ఒకటి. పూరి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ లో, హాట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఆగస్ట్ 25న లిగర్ విడుదల కానుంది. బాక్సింగ్ లెజెండ్, మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద అడుగుపెడుతున్నాడు. అందరికన్నా ముందు ఈ సినిమాను చూసిన సెన్సార్ వాళ్లు ఏమంటున్నారు? సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యుఎ సర్టిఫికెట్ పొందింది.
సెన్సార్ బోర్డ్ ప్రకారం, లిగర్ సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు. లిగర్ ఫస్ట్ పార్ట్ 1.15 గంటలు. రెండో పార్ట్ సగం 1. 05 గంటలు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి యాక్షన్ సీన్స్ చాలా కొత్త. యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయంట. సాంగ్స్ ని యూత్ కి నచ్చేలా డిజైన్ చేశారు. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ తోపాటు , ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ బాక్సర్‌గా చాలా ప్రొఫెషనల్ గా కనిపించాడు. అతని బాడీ పెద్ద అస్సెట్. లిగర్‌లో పూరి మార్క్ ఏడు ఫైట్లు, కిర్రెక్కించే ఆరు పాటలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇండియాలోనే లిగర్ పెద్ద ట్రెండ్ కానుంది.
లైగర్ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే, సెన్సార్ బోర్డ్ సభ్యులు విజయ్ దేవరకొండ నటనకు ఆశ్చర్యపోయారు. ఆ ఎనర్జీ, స్వాగ్ కి థమ్స్ అప్ ఇచ్చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనేకాదు, స్మూత్ డ్యాన్స్ మూవ్‌లు కూడా లిగర్ హైలెట్స్ అని సెన్సార్ టాక్. లైగర్‌తో విజయ్ దేవరకొండ కొత్త పాన్-ఇండియా సూపర్‌స్టార్‌గా ఏలేస్తాడని సెన్సార్ బోర్డ్ చెబుతోంది. ఈ మధ్యకాలంలో సినిమాలను చుట్టేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్న పూరి, సినిమాలో దేవరకొండ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ని పూరీ జగన్నాధ్ గొప్పగా చూపించాడు. అతని కేరక్టర్ సినిమాకు ఆయువుపట్టు. అతని డైలాగ్ డెలివరీకూడా వెరైటీ. మాట్లాడటానికి తడబడటం నుంచి విజయ్ బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతిదీ ఆడియన్స్ తెగ నచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ లైగర్ క్యారెక్టర్‌గా మారిన తీరుకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఆశ్చర్యపోయారు. విజయ్ దేవరకొండకు ఇది సరైన పాన్-ఇండియా లాంచ్ అవుతుందన్నది సెన్సార్ బోర్డు అంచనా. లైగర్ తో తుపాన్ రానుందంట. ఇది పోకిరి సినిమాకు పదింతలన్నది వాళ్ల టాక్.
ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, మిగిలిన లైగర్ యాక్టర్లు కూడా అదరగొట్టారు. షార్ట్ రన్‌టైమ్, లైగర్‌లోని యాక్షన్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, డైలాగ్ డెలివరీ, మైక్ టైసన్ తో ఫైట్, రమ్యకృష్ణ క్యారెక్టర్, తల్లి సెంటిమెంట్, విజయ్ దేవరకొండ-అనన్య పాండేల మధ్య రొమాన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. లైగర్ తో పూరి జగన్నాధ్ డైరెక్టర్ కి మాస్ ఫిదా అవుతారు. పూరి డైరెక్షన్, హీరో క్యారెక్టరైజేషన్‌తో బాలీవుడ్ ఆసూయపడటం ఖాయమన్నది సెన్సార్ టాక్.