iDreamPost
android-app
ios-app

Liger భలే ఛాన్స్ కొట్టేసిన లైగర్

  • Published Aug 15, 2022 | 1:14 PM Updated Updated Aug 15, 2022 | 1:14 PM
Liger భలే ఛాన్స్ కొట్టేసిన లైగర్

ఇంకో 9 రోజుల్లో రానున్న లైగర్ మీద మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల కన్నా నార్త్ లోనే ఎక్కువ ప్రమోషన్ చేసింది పూరి టీమ్. నిన్న వరంగల్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదటిసారి తెలంగాణలో బోణీ చేశారు. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మాస్ మూవీ ఏదీ రాకపోవడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని లైగర్ డిసైడ్ అయ్యింది. దానికి తోడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా విజయ్ దేవరకొండని రిసీవ్ చేసుకుంటున్న తీరు అక్కడి మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి లైగర్ ని ఎగబడి చూస్తారని కాదు కానీ ఓపెనింగ్స్ ఖచ్చితంగా వస్తాయి.

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన సినిమా ఇదే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో అనన్య పాండేని హీరోయిన్ గా పరిచయం చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రమ్యకృష్ణని ఊర మాస్ తల్లి వేషంలో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైక్ టైసన్ చేసిన పాత్ర పట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 25 నాటికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ బరిలో ఉండవు కాబట్టి లైగర్ కు ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు. పైగా బాలీవుడ్ లోనూ ఎవరూ ప్లాన్ చేసుకోలేదు. హిందీ వెర్షన్ ని నిర్మాత కరణ్ జోహార్ కావడంతో పక్కా ప్లాన్డ్ గా సోలోగా వచ్చేలా సెట్ చేసుకున్న తీరు వర్కౌట్ అయ్యేలా ఉంది.

వరస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు లైగర్ సక్సెస్ చాలా కీలకం. అందులోనూ దీంతో కనక హిట్ కొడితే నెక్స్ట్ చేసేవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బాగా వచ్చిందన్న నమ్మకంతోనే పూరి విజయ్ లు ఇద్దరూ రెండోసారి జనగణమన కోసం టై అప్ అయ్యారు. మూడోది కూడా ఉందంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ సెప్టెంబర్ నుంచి భారీ చిత్రాల సందడి మొదలవుతుంది. తెలుగులో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్స్ గని లాంటి డిజాస్టర్స్ ఉన్నాయి. మరి లైగర్ ఏ క్యాటగిరిలో పడుతుందో చూడాలి. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలయ్యింది