iDreamPost
android-app
ios-app

ఓటిటి పార్టనర్ ఫిక్స్ చేసుకున్న ‘లియో’.. వివరాలివే!

  • Author ajaykrishna Published - 09:57 AM, Fri - 20 October 23

స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా నమోదైంది.

స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా నమోదైంది.

  • Author ajaykrishna Published - 09:57 AM, Fri - 20 October 23
ఓటిటి పార్టనర్ ఫిక్స్ చేసుకున్న ‘లియో’.. వివరాలివే!

స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా నమోదైంది. ఫుల్ ఆన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని మాస్టర్ ఫేమ్ ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్, అనిరుధ్ సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన లియో.. ప్రెజెంట్ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది.

లియోకి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనే విషయం పక్కనపెడితే.. సినిమాకు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ వివరాలు అప్పుడే బయటికి వచ్చేశాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. లియో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని లియో టైటిల్ కార్డ్స్ లో రివీల్ చేశారని చెబుతున్నారు. లియో మూవీకి ఉన్న హైప్ ప్రకారం.. సినిమా ఓపెనింగ్స్ మాత్రం విజయ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా రాబోతున్నాయని అర్ధమవుతుంది. ఎందుకంటే.. విజయ్ ఓన్ క్రేజ్ కి ఇప్పుడు లోకేష్ కనగరాజ్ LCU క్రేజ్ తోడైంది. సో.. సినిమాలో విజయ్ కంటే.. కథకు LCU లింక్ ఎలా చేశారు? అనేది అందరిని థియేటర్స్ కి రప్పించే పాయింట్.

కట్ చేస్తే.. లియో మూవీ LCU లో భాగమా కాదా? అనే సందేహానికి సినిమా రిలీజ్ అయిన కొద్దీ గంటలకు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. కానీ.. ఫ్యాన్స్ లో ఆ ఎక్సయిట్ మెంట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లియో మూవీ ఓటిటి రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఊహించని మొత్తం చెల్లించిందని తెలుస్తుంది. అయితే.. ఈ సినిమా ఓటిటికి ఎప్పుడు వస్తుందనే విషయంపై ఇప్పుడే క్లారిటీ రాదు. ఎందుకంటే.. సినిమా థియేటర్స్ లో రన్ అవుతోంది. కనీసం థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతే లియో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక లియో సాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానల్ వారు సొంతం చేసుకున్నారు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.